ఏ ఉద్యమం ఉట్టిగానే పుట్టదు. హైదరాబాద్ లో వారి పెత్తనం ఎలా ఉంటదో అందరికీ తెలుసు. మన రాష్ట్రంలో అగర్వాల్ పేరుతో పెద్ద కంపెనీలు వారివే. దేశంలో కూడా అత్యధిక వ్యాపారాలు వీరివే. అనిల్ అగర్వాల్, బజాజ్, డిమార్ట్, బిర్లా గ్రూప్, సింఘానియా, మిట్టల్ స్టీల్ గ్రూప్, గోయెంక పేరుతో నడిచే కన్స్ట్రక్షన్ కంపెనీలు, విద్యా సంస్థలు, సింఘ్వీ పేరుతో వ్యాపారులు, జైన్ పేరుతో పెట్టుబడి దారులు, దాల్మియా , రుయా, జిందాల్…ఇలా వీళ్ళు దేశంలో 5 శాతం పెట్టుబడి దారుల్లో, దేశాన్ని శాసిస్తున్న వ్యాపార వేత్తలు వీరు.
స్టీల్, ఎలక్ట్రికల్ అధిక శాతం వీరిదే. వస్త్ర, ఫార్మా వీళ్ళ ఆధిపత్యం అధికం. రోజు వారి ఇంట్లోకి వాడే రిటైల్ వస్తువులు అమ్మే పెద్ద షాప్ లు వీరివే. గోల్డ్ వ్యాపారం వంద శాతం వారిదే. ఇతరులు ఎవరూ కూడా ఆ బిజినెస్ లోకి ప్రవేశించకుండా ఆ వ్యాపారాన్ని శాసిస్తున్నారు. బేగం బజార్, రాణిగంజ్ లో రోజు కోట్ల రూపాయల బిజినెస్ చేస్తూ హ్యాండ్ క్యాష్ ఇస్తేనే తీసుకొని, అలానే తిరిగి ఇస్తారు. బ్యాంక్ లను బాగా మేనేజ్ చేయడంలో దిట్ట వీరు. పై వాడు వాళ్లోడే ఉంటాడు. లేదా మేనేజర్లను ఏదోలా మేనేజ్ చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. పైన IAS, IPS లలో కూడా వీరు అధికమే. వివిధ డిపార్ట్మెంట్లను మేనేజ్ చేసి వారికి లోన్లు, ప్రాజెక్ట్ లు చాలా బాగా కేటాయించుకుంటారు. (ఏ పార్టీనీ ఏ సంస్థను దగ్గరికి రానియ్యరు. ఒక్క బిజెపి కి తప్పితే. మా అంటే పవర్ ఉన్న పార్టీకి ఏదో ఇయ్యాలీ కాబట్టి తప్పదు కాబట్టి ఇస్తారేమో).
మోడీ తెచ్చిన GST నీ ఎగగొట్టడంలో వీరి తర్వాతనే ఎవరైనా. ఆడిటర్ లతో, చార్టర్ అకౌంటెంట్ లతో తప్పుడు లెక్కలు చూయించి పక్కా దేశాన్ని మోసం చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా అంటే అతిశయోక్తి కాదు. జీడీపీ వృద్ధికి వీరి సహకారం గొప్పది అని చెప్పే సన్నాసులకు తెలియంది ఏమిటంటే జీడీపీ కి అధిక బొక్క పెట్టేది. పన్నులు ఎగ్గొట్టేది వీరేనే రహస్య సత్యం.
ఈ మధ్య కాలంలో అంటే గత 15ఏళ్లలో పల్లె టూర్ల వరకు కూడా పాకినది మార్వాడీ వ్యాపారం. ప్రతీ మండలం కేంద్రం, పెద్ద ఊర్లలో బేకరి, చాయ్, మిఠాయి షాపు లు వీరివే. లోకల్ వస్త్ర పెద్ద షాప్ లు పెద్ద మిఠాయి పెట్టగలుగుతున్నారు. ఊర్లలో పెద్ద షాప్ లు వీళ్ళు ఈజీగా పెట్టేస్తున్నారు. స్థానికులు వీళ్ల లాగా పెట్టలేక పోతున్నారు. స్థానిక కోమటి వాళ్లకు, స్థానిక స్వర్ణకారులకు అంటే హంసలోల్లకు కూడా దెబ్బే. అందుకే మా వ్యాపారాలు దెబ్బ తింటున్నాయని వేదన పడుతున్నారు. మా ఊరికొచ్చి మా పొట్ట కొడుతున్నారనీ ఆవేదన పుట్టు కొచ్చింది. ఊరికనే వ్యతిరేకత పుట్టదు. కారణాలు తప్పక ఉంటాయి. బంద్ ఇచ్చే స్థాయికి వచ్చారు అంటే బాధ లోంచి పెరిగిన బరాబర్ వ్యతిరేకతనే బంద్ అనుకుంటా!
credit :Vijay Aitha