BIG BREAKING : మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్!

BIG BREAKING

BIG BREAKING : మంత్రి కొండా సురేఖకు రేవంత్ సర్కార్ బిగ్ షాకిచ్చింది. మేడారం టెండర్లపై మంత్రి పొంగులేటితో వివాదం నెలకొన్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పనులను ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి రోడ్లు, భవనాల శాఖ కు ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ శాఖకు పనులను పర్యవేక్షించే సాంకేతికత లేదని, పనుల స్వభావం, నాణ్యత, నిర్ణీత సమయంలో పూర్తి చేయడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది.

వెంటనే ఈ రికార్డులను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న దశ నుంచి పనులను స్వాధీనం చేసుకోవాలని రోడ్లు-భవనాల శాఖకు సూచించింది. కాగా కొండా సురేఖ ఎండోమెంట్ మంత్రిగా ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఈ టెండర్ల ప్రక్రియకు బాధ్యత వహించాలి. అయితే పొంగులేటి వరంగల్ జిల్లాఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్నారు.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర (2026 జనవరి) నిర్వహణ, శాశ్వత నిర్మాణాల అభివృద్ధి కోసం ఇప్పటికే రేవంత్ సర్కార్ రూ. 150 కోట్లు వరకు నిధులను రిలీజ్ చేసింది. ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించేందుకు, పనులను వేగవంతం చేసేందుకు ఈ బదిలీ నిర్ణయం తీసుకున్నారు.

దేవాదాయ శాఖ మంత్రిగా తాను ఉన్నప్పటికీ, వరంగల్ ఇన్‌ఛార్జ్ మంత్రి హోదాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన శాఖ పరిధిలోని మేడారం టెండర్ల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని కొండా సురేఖ ఆరోపించారు. రూ. 71 కోట్ల విలువైన ఈ టెండర్ పనులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన వర్గానికి లేదా తన సొంత కంపెనీకి చెందిన కాంట్రాక్టర్లకు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా రాజకీయాల్లో పొంగులేటి పెత్తనం ఏంటని నిలదీశారు.