T NEWSకు లీగల్ నోటీసు.. కవిత సంచలనం!

tnews

 

T News : ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీ న్యూస్ ఛానల్ కు ఆమె లీగల్ నోటీసులు పంపించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆమె మీడియా సమావేశంలో కీలక కామెంట్స్ చేశారు. టీ న్యూస్ అల్తుఫాల్తు సోషల్ మీడియా అనుకున్నారా.. శాటిలైట్ ఛానల్ .. అ విషయం గుర్తుందా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాధవరం చేసిన ఆరోపణలు చేస్తే వెరీఫై చేసుకోవాలి కదా అని నిలదీశారు. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని లేదంటే కోర్టుకు ఈడుస్తానని కవిత హెచ్చరించారు.

అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం లకు కూడా ఆమె లీగల్ నోటీసు పంపించారు. తనపై, తన భర్తపై నిరాధారమైన భూకబ్జా ఆరోపణలు చేశారని నోటీసులు పంపించారు. ఇక తాను అమెరికా నుంచి వచ్చాక తన బంగారం, నగలు తాకట్టు పెట్టి బతుకమ్మ వేడుక చేశానని కవిత చెప్పుకొచ్చారు. మీలెక్క మంది మీద పడి దోచుకుతినలేదన్నారు.

తన భర్త ఎప్పుడైనా మీ దగ్గరికొచ్చి సాయం చేయండని ఎప్పుడైనా అడిగాడా పదేళ్లలో అని నిలదీశారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదని… మీరు చేసిన అక్రమాలను తనపై రుద్దొద్దన్నారు. తనకు ఎవరితోనూ ఎలాంటి అండర్‌స్టాండింగ్ లేదన్నారు. పిచ్చిపిచ్చగా మాట్లాడితే కాళ్లు విరగొడతానని,తోలు తీస్తానని హెచ్చరించారు.