Telangana : పెళ్లి చేసుకొని నెలకే పరార్.. బిగ్ ట్విస్ట్ ఏంటంటే?

Warangal

Telangana : మాయమాటలు చెప్పి ఓ యువకుడిని వివాహం చేసుకున్న మహిళ, నెల రోజులు తిరగకముందే ఇంట్లో ఉన్న విలువైన నగలు, నగదుతో పరారైన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పర్వతగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి విజయవాడకు చెందిన ఈ యువతి మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయమైంది.

ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరులో వీరిద్దరూ పెళ్లి చేసుకొని హనుమకొండలో అద్దె గది తీసుకుని కాపురం పెట్టారు.పెళ్లి జరిగిన కొద్ది రోజులకే.. వారం రోజుల కిందట పెళ్లి సందర్భంగా పెట్టిన బంగారం, ఇంట్లో భద్రపరిచిన నగదుతో ఆ మహిళ అదృశ్యమైంది.

పరారైన మహిళకు గతంలోనూ పలు వివాహాలు చేసుకుని, డబ్బు, నగలతో ఉడాయించిన చరిత్ర ఉంది. యువతి తల్లిదండ్రులు, బంధువులు అంతా ఫేక్ అని వరుడు ఆలస్యంగా తెలుసుకున్నాడు. అంతేకాక, ఆమెకు ఇప్పటికే 13 ఏళ్ల కుమార్తె ఉన్నప్పటికీ, తనకు పెళ్లి కాలేదంటూ మోసం చేసింది.ఈ క్రమంలో తనకు ఇంకా పెళ్లి కాలేదని, పలు మ్యాట్రిమోనీ సైట్‌లలో ప్రొఫైల్‌ అప్‌లోడ్‌ చేసి అమాయకులను పెళ్లి చేసుకుంటోంది. అనంతరం అందినకాడికి నగదు, నగలతో ఉడాయిస్తోంది.

గతంలో మరో ఇద్దరు యువకులను సైతం పెళ్లి పేరుతో మోసం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా, తమకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు రాలేదని తెలిపారు.

క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి 5 ఈజీ టిప్స్ మీ లివర్ డేంజర్‌లో ఉందని చెప్పే 7 లక్షణాలు! బాడీలో నీళ్లు తగ్గాయని చెప్పే 7 వార్నింగ్స్ సంక్రాంతి పుంజులు ‘అఖండ-2’: టికెట్ రేట్లు పెంపు సమంత, రాజ్‌ ఆస్తులెంత? దసరా భామలు సీడ్ సైక్లింగ్‌ ఎలా చేయాలంటే? ఏ చర్మానికి ఏ ఫేస్‌వాష్ వాడాలో తెలుసా? కాళ్లకు పసుపు ఎందుకు రాస్తారంటే..