ACB : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా- తీసుకున్న ఇందిరమ్మ ఇల్లు విషయంలో కూడా లంచగొండిలు తమ బుద్ది మార్చుకోవడం లేదు. తాజాగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ సెక్రటరీ అడ్డంగా బుకయ్యాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ గ్రామానికి చెందిన గంగాధర లాస్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది.
లక్ష రూపాయల బిల్లును ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే లాస్య భర్త గంగాధర శ్రీకాంత్ మధురానగర్ గ్రామపంచాయతీ కార్యదర్శి మునిగాల అనిల్ ను కలిసి ఇందిరమ్మ ఇల్లు బిల్లు చెల్లించాలని కోరాడు. అయితే ఫైలును ప్రాసెస్ చేసేందుకు రూ.10 వేలు డిమాండ్ చేశాడు పంచాయతీ కార్యదర్శి అనిల్.
దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు లంచం తీసుకుంటుండగా, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. పంచాయతీ కార్యదర్శి నుండి రూ. 10 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనిల్ పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వాధికారులు ఎవరికి ప్రజలు లంచం ఇవ్వవద్దని, పనులు చేయడానికి అధికారులు లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
రూ.10 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కి
కరీంనగర్ గంగాధర మండలం మధురానగర్‌కి చెందిన ఇందిరమ్మ ఇల్లు శ్రీకాంత్‌కు మంజూరు
బిల్లు కావాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి అనిల్ డిమాండ్
అదేంటని ప్రశ్నిస్తే తమ కృషి వల్లే ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింద్యంటూ తేల్చి చెప్పిన అనిల pic.twitter.com/FzqldoYqgs— Satya Telangana (@satya_telangana) October 10, 2025
కాగా ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపులో ఎవరైనా అవినీతికి పాల్పడితే క్షమించేది లేదని కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని స్వయంగా మంత్రి పొంగులేటి చెప్పిన కూడా లంచగొండిలు లైట్ తీసుకుంటున్నారు. ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై ఉన్నతాధికారులతో విచారణ జరిపిస్తామని మంత్రి హెచ్చరించారు.
తెలంగాణ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతి ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రకటించారు. లంచం అడిగితే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ (1800 599 5991) అందుబాటులో ఉంది.
ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడత బిల్లు మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేయగా ఏసీబీ ట్రాప్‌లో పట్టుబడ్డాడు సూర్యాపేట జిల్లాకు చెందిన పంచాయతీ కార్యదర్శి (ఎం. వెంకయ్య). సూర్యాపేట జిల్లా, మద్దిరాల మండలం, పోలుమల్లలో లబ్ధిదారుడి నుంచి రూ.10,000 లంచం డిమాండ్ చేసిన ఒక ఇందిరమ్మ కమిటీ సభ్యుడిని తొలగించి, క్రిమినల్ కేసు నమోదు చేశారు.