Bus Accident : కొంపముంచిన కంకర.. ఊపిరాడక 21 మంది.. 10ఏళ్ల పాప కూడా!

rangareddy

Bus Accident : రంగారెడ్డి జిల్లాలో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంతో RTC బస్సును  ఢీకొంది. దీంతో  స్పాట్‌లోనే 21 మంది మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. మృతుల్లో తల్లీబిడ్డ ఉన్నారు. పాప వయసు 10 నెలలు.ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి కన్నీరు పెట్టిస్తుంది.

మృతుల్లో 11 మంది మహిళలు ఉన్నారు. చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. టిప్పర్ లారీ స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ఆర్టీసీ బస్సుపైకి దూసుకెళ్లింది. లారీలోని కంకర బస్సులోని ప్రయాణికులపై కూరుకుపోయింది. దీంతో వారంతా ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడ్డారు. అలా చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. బస్సులో ఎక్కువగా ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు 21 మంది చనిపోయారు.

గాయాలైన వారికి చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కంకరతో బస్సంతా నిండిపోవడంతో సహాయ చర్యలు కష్టంగా మారాయి. మూడు జేసీబీల సహాయంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.మీర్జాగూడా దగ్గర హైదరాబాద్- బీజాపూర్‌ హైవేపై ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనపై సీఎం రేవంత్​ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని.. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదం వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు.