Ranga Reddy: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా 17 మంది చనిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన జరగగా.. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు.
ఘోర ప్రమాదం.. 17 మంది మృతి
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో హైదరాబాద్-బీజాపుర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సును కంకర లారీ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా… https://t.co/IfnjZnHoWs pic.twitter.com/hR9EN4n8iT
— ChotaNews App (@ChotaNewsApp) November 3, 2025
ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన బస్సులో దాదాపుగా 70 మంది ప్రయాణికులున్నారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లుగా సమాచారం.. విద్యార్థులు హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లుగా తెలుస్తోంది.
ఆదివారం సెలవు కావడంతో ఇంటికి వెళ్లి.. తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్… బస్సును ఢీకొంది. ఈ ఘటనలో పూర్తిగా బస్సు ముందు భాగం ధ్వంసమైంది.. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
