BIG BREAKING : రేవంత్ కు మరో షాక్.. రేషన్ షాపులు బంద్

Ration Shops : తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్.. అక్టోబర్ 1వ తేదీ నుండి రేషన్ షాపులు బంద్ కానున్నాయి. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని పౌర సరఫరా శాఖకు సమ్మె నోటీసులు ఇచ్చారు రేషన్ డీలర్లు . వచ్చే నెల 1వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేయనున్నట్టు రేషన్ డీలర్ల సంఘాలు ప్రకటించాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ నిధులు విడుదల చేయడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రేషన్ డీలర్ల సమ్మె బాట పట్టనున్నారు. వెంటనే నిధులు విడుదల చేయకపోతే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఐదు నెలలుగా కమిషన్ బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని డీలర్లు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలైన నెలవారీ గౌరవ వేతనం (రూ. 5,000), కమిషన్ పెంపు, హెల్త్ కార్డుల జారీ, రేషన్ దుకాణాల అద్దె, రవాణా ఛార్జీల భారం ప్రభుత్వమే భరించడం వంటివి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.