Kamareddy : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా రాంగ్‌రూట్‌లో వెళ్లి స్కూటీని ఢీకొంది టిప్పర్. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా, మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. స్కూటీపై ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నారు.
వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు.జంగంపల్లి వద్ద 44 నేషనల్ హైవేపై ఈ ఘటన జరిగింది. మృతులు ఖమ్మం జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. కామారెడ్డి నుంచి బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాంగ్ రూట్‌లో రావడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.