Ameenpur : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో దారుణం జరిగింది. తన కూతురు శ్రీజను ప్రేమిస్తున్నాడని శ్రావణ్ సాయి అనే ఓ యువకుడిని ఆమె తల్లి కొట్టి చంపేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ఇప్పుడు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. శ్రీజ తల్లి సిరి ఓ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. శ్రవణ్‌ను నేను చూడడం రెండోసారి మాత్రమేనని తానే అతన్ని లోపలికి పిలిచానని వెల్లడించింది.
ఫస్ట్ టైం 7 నెలల క్రితం పాప కాలేజ్ దగ్గరకు వచ్చాడని…. ఆ రోజు నా కూతురు తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల వరకు ఇంటికి రాలేదని తెలిపింది. నేను మాదాపూర్ పీఎస్‌కు వెళ్లి పాప మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చానని చెప్పుకొచ్చింది. ఆ తరువాత విషయం తెలియడంతో శ్రవణ్ పెద్దనాన్నను పిలిచి వార్నింగ్ ఇచ్చామన్నారు సిరి. ఇద్దరు కలవకపోతే ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. రాత్రి 11 గంటలు దాటినా కూడా గల్లీల్లో తన కూతురుతో తిరిగేవాడని సిరి ఆరోపించారు. గండి మైసమ్మ దగ్గర పార్కులో పాడు పనులు చేస్తారా అని ఆమె నిలదీశారు. ప్రాబ్లమ్ తన కూతురు కాబట్టే తన కూతురుని కొట్టానని సిరి వెల్లడించారు.
బాధితుడు జ్యోతి శ్రావణ్ సాయి మైసమ్మగూడలోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. శ్రావణ్ సాయి, బీరంగూడకు చెందిన శ్రీజతో లవ్ లో ఉన్నాడు.ఇద్దరికి చిన్నప్పటినుంచి పరిచయం ఉంది. తమ కూతురిని ప్రేమిస్తున్నాడనే కారణంతో ఆగ్రహించిన యువతి తల్లి సిరి.. పెళ్లి గురించి మాట్లాడదామని నమ్మించియువతితో ఫోన్ చేయించి శ్రవణ్ సాయిని ఇంటికి పిలిపించింది.
ఇంటికొచ్చిన సాయిపై కోపంలో ఉన్న అమ్మాయి తల్లి, బంధువులు అంతాకలిసి బ్యాట్ తీసుకొని శ్రవణ్‌పై దాడి చేశారు. అడ్డొచ్చిన కూతుర్ని కొట్టారు. ఈ క్రమంలో శ్రవణ్ తలకు, నడుముకు బలమైన దెబ్బలు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే శ్రవణ్ ని రాత్రంతా చిత్రహింసలలకు గురి చేసి చంపేశారని మృతుడి పెదనాన్న ఆరోపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అమీన్‌పూర్ పోలీసులు.
