Smita Sabharwal: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టులో పిటిషన్ వేశారు. కమిషన్ రిపోర్టులో తన పేరు తొలగించాలని స్మిత తన పిటిషన్ లో పేర్కొన్నారు. వివరణ ఇచ్చేందుకు తనకు టైమివ్వలేదని స్మిత వాదించారు. ఘోష్ కమిటీ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్ లో ఆమె డిమాండ్ చేశారు.
స్మిత సబర్వాల్ చర్యలను రిపోర్ట్ లో పేర్కొన్న పీసీ ఘోష్ కమిషన్
కాలేశ్వరం నిర్మాణాలపై స్మితా సబర్వాల్ రివ్యూ చేసిందన్న కమిషన్
బ్యారేజ్ లను సందర్శించిన పలు ఫోటోలను, సైతం రిపోర్ట్ లో పొందుపరిచిన కమిషన్
కొన్ని జిల్లాలు తిరిగి ఫీడ్బ్యాక్ ను ఎప్పటికప్పుడు అప్పటి సీఎంకు స్మిత…
— Pulse of Telangana (@pulseoftelangan) September 23, 2025
కాగా స్మితా సబర్వాల్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో (CMO) కార్యదర్శిగా 2014 జూన్ నుండి 2023 డిసెంబరు వరకు పనిచేశారు. ఈ సమయంలో ఆమెకు జలవనరుల శాఖ సహా పలు కీలక శాఖల బాధ్యతలు అప్పగించారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలు, ముఖ్యమంత్రికి ఫైళ్ల నివేదన, ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ వంటి వాటిలో ఆమె పాత్ర కీలకంగా మారింది.
అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారాక కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ జరిపేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ విచారణలో భాగంగా స్మితా సబర్వాల్ కూడా విచారణకు వెళ్లారు.
విచారణ సమయంలో ఆమెకు ప్రాజెక్టులోని పలు అంశాలపై తెలియదు, గుర్తు లేదు, మరిచిపోయా అనే సమాధానాలు చెప్పినట్లుగా ప్రచారం సాగింది. ప్రాజెక్టు నిర్మాణంలో విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపారని, ఆమెపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు కూడా నివేదికలు పేర్కొన్నాయి.