Bus Accident: ఏపీలోని కర్నూలులో ఘోర బస్సు ప్రమాదంలో యాదాద్రికి చెందిన యువతి మృతి చెందింది. బెంగళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న అనూష రెడ్డి అనే యువతి.. దీపావళి పండుగ సందర్భంగా సొంతూరుకు వచ్చింది. తిరిగి బెంగళూరు వెళ్లేందుకు రాత్రి ఖైరతాబాద్‌లో బస్సు ఎక్కింది అనూష. చివరికి బస్సు ప్రమాదంలో చిక్కుకుని సజీవదహనం. అయిపోయింది. గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూషరెడ్డి కుటుంబసభ్యులకు ఆమె మరణ వార్త తెలియగానే కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అనూష మరణంతో వస్తకొండూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Kaveri Bus Fire Accident..
కావేరీ బస్సు ప్రమాదంలో.. తెలంగాణకు చెందిన యువతి మృతి..యాదాద్రికి చెందిన యువతి మృతి
బెంగళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న అనూష అనే యువతి దీపావళి పండుగ సందర్భంగా.. సొంతూరుకు వచ్చిన అనూష
బెంగళూరు వెళ్లేందుకు రాత్రి ఖైరతాబాద్‌లో బస్సు ఎక్కిన… pic.twitter.com/ZlPn0lRswz
— SV6 NEWS (@Sv6News) October 24, 2025
ఇదే ఘటనలో తల్లి కొడుకు కూడా మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన నాన్ బేబీ(64), కిషోర్ కుమార్(41) బెంగళూరు నుంచి దీపావళి పండక్కి వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. గురువారం సాయంత్రం పటాన్‌చెరు అంబేడ్కర్ కూడలి వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కి బెంగళూరు బయలుదేరారు. బస్సు ప్రమాదంలో బాపట్ల జిల్లా వాసి గన్నమనేని ధాత్రి మృతి చెందింది. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ధాత్రి హైదరాబాద్ లోని మేనమామ ఇంటికి వచ్చి తిరిగి బెంగళూరు వెళ్తూ మృతి చెందింది.
ఈ బస్సు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన ఓ కుటుంబం మృతి చెందింది. గోళ్ల రమేష్ కుటుంబం మృతి చెందినట్లుగా బంధువులు వెల్లడించారు. గోళ్ల రమేశ్ (35), అనూష(30), శశాంక్ (12), మాన్యత (10) సజీవదహనం అయ్యారు. వీరిది వింజమూరు మండలం గోళ్లవారిపల్లి గ్రామస్తులు. బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50వేల తక్షణసాయం ప్రకటించారు.
బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి..
కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం చాకలకొండ పంచాయతీ లోని గొల్లవారిపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. గోళ్ళ రమేష్ (35), అనూష (30), మన్విత (10), మనీష్ (12) మృతి… pic.twitter.com/sX4CAaFdbi
— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) October 24, 2025
