BIG BREAKING తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో కోత విధిస్తామన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన కార్యక్రమంలో సీఎం ఈ కామెంట్స్ చేశారు.
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినట్లు తన దృష్టికి వస్తే, సంబంధిత ఉద్యోగి జీతం నుంచి 10 నుంచి 15 శాతం వరకు కోత విధిస్తామని వెల్లడించారు. కోత విధించిన ఆ మొత్తాన్ని నేరుగా ఆ ఉద్యోగి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పుకొచ్చారు. దీని కోసం త్వరలోనే ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఎలాగైతే అందుతుందో వారి తల్లిదండ్రులకు కూడా అదే రోజున ఈ మొత్తం చేకూరులే చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దన్నారు సీఎం. నిస్సహాయులకు సహాయం చేయండి.. పేదలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
కాగా గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్.. చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.