స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి ఓ కామాంధుడు అని అన్నారు. హనుమకొండ లోని టీచర్ కాలనీలో, పర్వతగిరిలో చెప్పు దెబ్బలు తిన్న చరిత్ర కడియం శ్రీహరిది అని ఆరోపించారు. సొంత భార్యనే అతన్ని చెంపదెబ్బ కొట్టిందని చెప్పారు రాజయ్య. కడియం శ్రీహరి చచ్చిన శవం లాంటివాడని, నా వెంట్రుక కూడా పీకలేడని మండిపడ్దారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మరోసారి రెచ్చిపోయిన తాటికొండ రాజయ్య..
దొంగే దొంగ అన్నట్టు ఉంది కడియం వ్యవహారం
కడియం శ్రీహరి నా వెంట్రుక కూడా పీకలేడు
ఆరు నూరైనా ఘనపూర్ కు ఉపఎన్నిక రావడం ఖాయం
ఉపఎన్నికల్లో డిపాజిట్ రాకుండా చేసి, పర్వతగిరికి తరిమి కొడతాం
కడియం శ్రీహరి కామాంధుడని ఆయన… https://t.co/zMOBF5uVvI pic.twitter.com/LXv8CQJnqm
— ChotaNews App (@ChotaNewsApp) September 14, 2025
కడియం దమ్ము దైర్యం ఉంటే రాజీనామా చేయాలని రాజయ్య సవాల్ విసిరారు. తన శవయాత్ర చేసినా, ఇంకేం చేసినా తన ఆనవాళ్లు చేరపలేరని రాజయ్య చెప్పుకొచ్చారు. మనిషి తెల్లగా కనబడితే కడియం శ్రీహరి ఓర్వలేడన్నారు రాజయ్య. కడియం తనపై తన అనుచరులతో సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేయిస్తున్నాడని చెప్పారు.
మరోవైపు జనగామ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రఘునాథపల్లి మండల రైతులకు సాగునీరు అందించాలని.. ఈ రోజు మూడవ విడత పాదయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమైన స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను సుబేదారి పోలీసులు హన్మకొండలో హౌస్ అరెస్ట్ చేశారు. రఘునాథపల్లి మండలంలోని కుర్చపల్లిలో తాటికొండ రాజయ్య గో బ్యాక్ – గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాజయ్య ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కాంగ్రెస్ నేతల హెచ్చరికలు జారీ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. NSUI నాయకులం గ్రామాల్లో తిరగనివ్వం.. దాడి చేయడానికి కూడా వెనకాడమంటూ వార్నింగ్ ఇచ్చారు.