ట్రైన్ మిస్ కావడంతో BUS ఎక్కి .. తండ్రి దగ్గరుండి మరి… ఇంతకన్నా దారుణం ఉంటుందా?

sisters

BUS : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మీర్జాగూడ సమీపంలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును, కంకర లోడుతో వేగంతో వస్తున్న టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు లారీ బోల్తా పడి, దానిలోని కంకర లోడు మొత్తం బస్సుపై పడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 24 మంది చనిపోయారు.

ఈ దుర్ఘటనలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు చనిపోయారు, తనుషా, సాయి ప్రియ, నందిని అనే ముగ్గురు అక్కా చెల్లెళ్లు హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీ డిగ్రీ చదువుతున్నారు. మృతులు తాండూరు పట్టణం గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలుగా గుర్తించారు.

వాస్తవానికి వీరు ఈ రోజు ఉదయం ట్రైన్ లో వెళ్లా్ల్సి ఉంది, ఉదయం తాండూరులో ట్రైన్ మిస్ కావడంతో బస్సు ఎక్కారు. కుమార్తెలు ముగ్గుర్ని తాండూరులో బస్సు ఎక్కించిన తండ్రి ఎల్లయ్య గౌడ్ జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిన కాసేపటికే ఇలా ప్రమాదంలో కన్న కూతుళ్లు చనిపోయారనే వార్త వినిపించింది.

బాధితులను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న నందిని, డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్న సాయి ప్రియ, ఎంబీఏ విద్యార్థిని తనుషగా గుర్తించారు. సోదరీమణులు ఇటీవల బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు ఇంటికి తిరిగి వచ్చి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తిరిగి వెళుతుండగా ప్రమాదంలో చిక్కుకుని చనిపోయారు.

ఈ విషయం తెలియగానే సొమ్మసిల్లి పడిపోయింది వారి తల్లి.. మరోవైపు కుమార్తెలు మృతి చెందడంతో తండ్రి రోదిస్తున్నాడు. ఆయనకు నలుగురు కుమార్తెలు. ఈ నెల 15వ తేదీన పెద్ద కుమార్తె వివాహం చేయగా.. మిగతా ముగ్గురు కుమార్తెలు బస్సు ప్రమాదంలో మృతి చెందారు. ఆ కుటుంబం, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.