Hyderabad: నీ ముఖం మండ.. చదవడం లేదని అట్లకాడతో కాల్చిన టీచర్!

Hyderabad

Hyderabad : హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ట్యూషన్ టీచర్ దాష్టీకానికి పాల్పడింది. ఏడేళ్ల చిన్నారిని అట్లకాడను ఉపయోగించి కాల్చింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థి తేజ నందన్ ట్యూషన్‌లో చదవడం లేదనే చిన్న కారణంతో టీచర్ శ్రీ మానస విచక్షణారహితంగా బాలుడిపై దాడికి పాల్పడింది.శరీరంపై ఏకంగా 8 చోట్ల వాతలు పెట్టడంతో బాలుడి చేతులు, కాళ్ళు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.

తేజ నందన్ శరీర భాగాలపై వాతలు, కాలిన గాయాలు గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.పోలీసులు వెంటనే స్పందించి, బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

అట్లకాడతో కాల్చడం వల్ల బాలుడు తేజ నందన్ నడవలేని పరిస్థితిలో ఉన్నాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కొడుకును అమానుషంగా హింసించిన ట్యూషన్ టీచర్ శ్రీ మానసపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.