Jubilee Hills : జూబ్లీహిల్స్ బై పోల్‌ లో బిగ్ ట్విస్ట్.. బీఆర్ఎస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి!

vishnuvardhan reddy

Jubilee Hills : జూబ్లీహిల్స్ బై పోల్‌ రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ నుంచి దివగంత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత, కాంగ్రెస్‌ నుంచి నవీన్‌యాదవ్‌, బీజేపీ నుంచి లంకల దీపక్‌ రెడ్డి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు కూడా వేశారు.

ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటున్నాయి. బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఒకవేళ ఆమె నామినేషన్ రిజెక్ట్ అయితే ముందు జాగ్రత్తగా పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితో కూడా బీఆర్ఎస్ నామినేషన్ వేయించినట్లుగా తెలుస్తోంది.

మరోవైపు జూబ్లీహిల్స్‌లో ప్రచారం కోసం 40 మంది క్యాంపైనర్లతో లిస్ట్ విడుదల చేసింది కాంగ్రెస్. ఇందులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు. కాగా 2023లో గెలిచిన BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మరణించడం వలన ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.

నవంబర్ 11న ఈ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతోంది, ఈ ఫలితం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.