Mancherial : భర్తతో పాటుగా అత్తమామలు, మరిది వేధింపులు భరించలేక ఓ వివాహిత తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది.ఈ విషాదకరమైన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మంచిర్యాల సీఐ ప్రమోద్‌రావు మీడియాకు తెలిపారు.
మంచిర్యాలలోని ఎల్‌ఐసీ కాలనీకి చెందిన మిట్టపల్లి ప్రియాంకకు, మందమర్రి మండలం సారంగపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌తో 2014లో వివాహం జరిగింది. వీరికి రామ్, లక్ష్మణ్ (9) అనే కవల పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రియాంకను భర్త ప్రవీణ్, అత్తమామలైన రమాదేవి, సత్యనారాయణ, మరిది ప్రదీప్ కలిసి తరచూ వేధించేవారు.
కొన్ని రోజులు ఈ వేధింపులు భరించింది ప్రియాంక.. ఈ వేధింపులు రోజురోజుకు ఎక్కువయ్యాయి. నవంబర్ 9వ తేదీన ప్రియాంకను వారంతా .. తీవ్రంగా కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. దీంతోప్రియాంక తన పిల్లలతో కలిసి తల్లిగారింటికి వచ్చి నివాసం ఉంటోంది. అయినప్పటికీ అత్తింటి వేధింపులు ఆగకపోవడంతో ప్రియాంక తీవ్ర మనస్తాపానికి గురైంది.
దీనికి తన చావే పరిష్కారం అనుకుంది. ఆదివారం రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ ప్రమోద్‌రావు మాట్లాడుతూ… మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామన్నారు.
