బైపోల్ : BRSకు కలిసిరాని మహిళా అభ్యర్థులు!

brs party

BRS : తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్ (BRS) పార్టీకి సరికొత్త సవాలును విసిరాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణం తర్వాత వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం అనేది ఆ పార్టీకి వరుసగా ఓటములను మిగిల్చింది. సానుభూతిని ఓట్లుగా మార్చుకోవడంలో బీఆర్‌ఎస్ వ్యూహం పలు ఉప ఎన్నికల్లో విఫలమైంది.

దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నిక బీఆర్‌ఎస్‌కు మొదటి పెద్ద షాక్… రామలింగారెడ్డి సతీమణి సుజాతకు ఆ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చింది. అయితే ఆ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కేవలం 1,079 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఇది బీజేపీకి బలమైన పునాది ఏర్పడింది.

2023 అసెంబ్లీ ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యనందితకు టికెట్ ఇవ్వగా.. ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది. ఆ తరువాత ఆమె అకాల మరణం తరువాత వచ్చిన ఉప ఎన్నికలో ఆమె అక్క నివేదితకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ గెలుపొందారు.

ఇక తాజాగా జూబ్లీహిల్స్ బైపోల్ లో గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే.. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. ఈ ఓటమి బీఆర్‌ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మూడు సీట్లలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈ మూడు ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ ప్రచారం చేయలేదు.