Hyderabad : హైదరాబాద్‌లో మరోసారి హనీట్రాప్ కలకలం రేపింది. చేవెళ్లలో యోగాశ్రమం నిర్వహిస్తున్నాడు రంగారెడ్డి. అయితే అనారోగ్య సమస్యల పేరుతో అతని యోగాశ్రమంలో ఇద్దరు మహిళలు చేరారు. కొద్ది రోజులుగా రంగారెడ్డితో వీరిద్దరూ చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. అయితే రంగారెడ్డితో న్యూడ్ గా, సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్‌కు దిగింది అమర్ అనే ఓ గ్యాంగ్.
దీంతో వారి బెదిరింపులకు భయపడి రూ. 50 లక్షల చెక్కులు ఇచ్చాడు రంగారెడ్డి. అయినప్పటికీ అమర్ గ్యాంగ్ బెదిరింపులు ఆగలేదు. మరో రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో రంగారెడ్డి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మహిళలు మంజుల, రజిని, అమర్‌తో సహా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని తెలిసింది. యల్ ఎస్టేట్‌లో డబ్బులు సరిపోకపోవడంతో యోగా గురువును హనీట్రాప్ చేసి, డబ్బులు కాజేయాలని పథకం వేశారు. హనీ ట్రాప్‌పై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ హనీట్రాప్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలంగా మారింది.