సీఎం కేసీఆర్ మాట మీద నిలబడతారా ? మనసు మార్చుకుంటా ?

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు…సీఎం కేసీఆర్ ఇచ్చిన డెడ్ లైన్ ఇవాళ(మంగళవారం) అర్ధరాత్రిలో ముగుస్తుంది. ఓవైపు ఇవాళ్టితో కేసీఆర్ పెట్టిన గడువు ముగుస్తుంది. కానీ..ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 208 మంది మాత్రమే విధుల్లో చేరినట్లు తెలుస్తోంది. బస్ భవన్ కేంద్రంగా 100 మందికిపైగా విధుల్లో చేరినట్లు సమచారం. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మాట మీద నిలబడతారా ? లేకపోతే మనసు మార్చుకుంటారా? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మొన్న భేటీ అయిన కేబినెట్…ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చేసింది. కేబినెట్ మీటింగ్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్…ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు సాధ్యం కాదని తేల్చేశారు. నవంబర్ 5లోగా విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు పోతాయని వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఎవరూ పెంచనంతగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచామని, సాధ్యంకాని డిమాండ్లతో సమ్మె చేయడం చట్ట విరుద్ధమన్నారు. కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని మరో ఛాన్స్ ఇస్తున్నాం…నవంబర్ 5వ తారీకు లోపు విధుల్లో చేరకపోతే ఇక వాళ్ల ఉద్యోగాలు ఉండవని వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. అయినా ఆర్టీసీ కార్మికులు మాత్రం ఆశించిన స్థాయిలో విధుల్లో చేరలేదు. ఇప్పటి వరకు విధుల్లో చేరిన వాళ్లు అంతంత మాత్రమే. కనీసం ఒక్కశాతం కార్మికులు కూడా విధుల్లో చేరలేదు. మెజారిటీ కార్మికులంతా సమ్మెలోనే ఉన్నారు.

అయితే సీఎం తన నిర్ణయాలను గతంలో తిరిగి సమీక్ష చేసుకున్నారు. అదే తరహాలో ఆర్టీసీ సమ్మె విషయంలో కూడా సీఎం తన నిర్ణయాన్ని పున:సమీక్షిస్తారా ? లేకపోతే.. ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యోగాలు ఊడినట్లేనా ? అనేది…తెల్లారితే గానీ తేలదు.

Leave a Reply