అవి పాతవి, ఇప్పటివి కాదు…. దీపావళి ప్రోమోలపై TV9 క్లారిటీ

దీపావళి సందర్భంగా ఛానెల్స్ ఫ్రోమోలు, ప్రోగ్రాములు చేయడం కామన్. అయితే…అవి కొన్ని కొన్ని సార్లు కాంట్రవర్సీలు అవుతుంటాయి. టీవీ9 పాత యాజమాన్యం ఆధ్వర్యంలో చేసిన కొన్ని వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. అయితే…వాటిపై స్పందించింది ప్రస్తుత యాజమాన్యం… “గ్రీన్ దీపావళి సందర్భంగా మా ఛానెల్ లో ప్రసారమైన ప్రోమో హిందువుల మనోభావాలను నొప్పించినట్లుగా మా దృష్టికి వచ్చింది. వెంటనే వాటిని తొలగించాం. అభ్యంతరాలు వచ్చిన వెంటనే ప్రోమోలను నిలిపివేశాం. అయితే కొందరు దురుద్దేశంతో ఈ ప్రోమోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు, హిందువుల మనోభావాలపై టీవీ9కు పూర్తి గౌరవం ఉందని స్పష్టం చేస్తున్నాం.” అంటూ ఓ ప్రతికా ప్రకటనను విడుదల చేసింది టీవీ9 యాజమాన్యం.

Leave a Reply