రవిప్రకాశ్ ఛాప్టర్ క్లోజ్… బీజేపీనే బ్లాక్ మెయిల్ చేశాడా ?

టీవీ9 రవిప్రకాశ్. మీడియా డాన్ గా, ఎలక్ట్రానిక్ మీడియాకు నడకలు నేర్పిన ట్రెండ్ సెట్టర్ బ్రాండ్ ఇమేజ్. స్థాపించిన సంస్థ నుంచే గెంటేయబడ్డ రవిప్రకాశ్ కొత్త ఛానెల్ రూపంలో బెబ్బులిలా గర్జించబోతున్నాడని ఆ మధ్య ప్రచారం జరిగింది కదా. తెలుగు రాష్ట్రాలను బేస్ చేసుకుని జాతీయ స్థాయిలో తనకున్న విస్తృత పరిచయాలతో ఫినిక్స్ లా లేస్తాడని ఓ వర్గం ఆయనకు చిడతలు వాయించడం గుర్తుంది కదా. ఇపుడా ఇమేజులు, ఆయనకున్న కీర్తి కిరీటాలను తన బ్రాండ్ ఇమేజ్ లోగోలో మడతెట్టుకునే టైమొచ్చిందంటున్నారు. ఫైర్ బ్రాండ్ జర్నలిస్ట్ గా టీవీ9 రవిప్రకాశ్ చాప్టర్ క్లోజ్ అయినట్టేనన్న ప్రచారం ఊపందుకుంది. దానికి కారణాలు బోలెడు. తెలంగాణ బీజేపీకి మాజీ ఎంపీ వివేక్ ఎంట్రీతో కొత్త ‘‘వెలుగు’’ వచ్చింది. పేపర్-ఛానెల్ రెండూ లేని లోటు తీర్చగల వ్యక్తి బీజేపీలో చేరారు. ఇక RPతో బీజేపీతో ఏంటి పని ? వాడకంలో ఆరితేరిన బీజేపీకి ఇక రవిప్రకాశ్ అవసరమా ? ఇది బయటికి కనిపించే కారణం. ఎవరైనా ఈజీగా విశ్లేషించగల రీజన్.

ఇంటర్నల్ టాక్స్ వేరే ఉన్నాయి. కమ్మ మీడియాలో ఆంధ్రా లాబీలో రవిప్రకాశ్ పాత్ర కీలకం. అది ఒకప్పుడు. చంద్రబాబుకు చంచాగిరి చేసి… జగన్, కేసీఆర్ ఇద్దరికీ టార్గెట్ గా మారారు రవిప్రకాశ్. రెండు రాష్ట్రాల్లో తనంటే కస్సుమనే ఇద్దరు పాలకుల నడుమ ఊపిరాడని స్థితి రవిప్రకాశ్ ది. అందుకే బీజేపీ శరణుజొచ్చాడు. ఓ దశలో బీజేపీ పెద్దలు సైతం రవిప్రకాశ్ కు అండగా నిలుస్తారన్న ప్రచారం జరిగింది. రిలయన్స్ అంబానీ గ్రూప్ కింద ఓ ఛానెల్ పెట్టి నడిపిస్తాడని.. లేదంటే తానే సొంతంగా బీజేపీ అండతో రంగంలో దిగుతాడని కథనాలొచ్చాయి. కానీ టీవీ9లో రవిప్రకాశ్ చేసిన తింగరి చేష్టలతో యాజమాన్యం తరిమేసింది. తన అనుకున్న వర్గం అంతా సైలెంట్ అయింది. అధికార బలం లేక… అనుచరవర్గం అండ లేక దిక్కుతోచని స్థితిలో పడిపోయిన RPకి బీజేపీకి అండగా నిలుస్తుందనుకున్నారంతా. కానీ బీజేపీతోనూ బ్లాక్ మెయిలింగ్ కు దిగాడని ఓ గుసగుస. ఛానెల్ పెట్టి నడిపిస్తానన్న ప్రపోజల్ ను ముందుపెట్టి తన మీదున్న కేసుల్ని మాఫ్ చేయించుకునే మరో కార్యానికి దిగాడట. పైగా ఆయన మీదున్న కేసులేవీ ఇప్పట్లో తేలేలా లేవు. అన్నింటికి మించి తెలంగాణ-ఆంధ్రాలో కేసీఆర్, జగన్ కు యాంటీ కథనాలు కుమ్మేసేంత ధైర్యం చేస్తాడా అన్న డైలమాలో పడిపోయిందట బీజేపీ. రవిప్రకాశ్ కు అండగా నిలిచే కమ్మ సామాజిక-పారిశ్రామిక వర్గం కూడా బీజేపీలో చేరిపోయింది. దాంతో రవిప్రకాశ్ దారులన్నీ మూసుకుపోయినట్టు భావిస్తున్నారు.

అన్నింటికి మించి తనకు షెల్టర్ ఇచ్చిన సంస్థకే సున్నం పెట్టే రవిప్రకాశ్ లాంటి క్యారెక్టర్ ని భరించే స్థితిలో ఏ పెట్టుబడిదారుడూ లేడని మరో టాక్. మీడియాలో అవినీతిని లీగలైజ్ చేసిన గలీజు ట్రాక్ రికార్డున్న రవిప్రకాశ్ ను ఎవరూ అంత ఈజీగా నమ్మే సాహసం చేయట్లేదట. పైగా ఇపుడాయన వయసు 55 ఏళ్లు. 15 ఏళ్ల క్రితం ఎలక్ట్రానిక్ మీడియా స్ట్రాటజీనే మళ్లీ వర్కవుట్ చేయడం తప్ప ఆయనలో క్రియేటివ్ యాంగిల్స్ ఇక లేవన్నది మరో వాదన. పైగా టీవీలు-పేపర్ల(మెయిన్ స్ట్రీమ్ మీడియా)కు రోజులు దగ్గరపడ్డాయి. ఇపుడంతా డిజిటల్-సోషల్ మీడియా హవా. రవిప్రకాశ్ రాచకార్యాలను సోషల్ మీడియా ఇప్పటికే చీరి చింతకు కడుతోంది. ఆయన చెప్పే నీతులు ఎవరింటారని సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్టయ్యాయి కూడా. అందుకే బీజేపీ కూడా రవిప్రకాశ్ ను మోసుడెందుకని చేతులు దులుపుకుందట. ఇవన్నీ గమినించిన కొందరు ఈ కమ్మ మీడియా మొఘల్, కమ్మ మీడియా సామ్రాట్ రవిప్రకాశ్ చాప్టర్ క్లోజ్ అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.

LEAVE A REPLY