Budget 2026: ఇప్పుడు కొత్త ఇల్లు కొనాలా? లేక అద్దె ఇంట్లోనే ఉండాలా?

Budget 2026

Budget 2026: బడ్జెట్‌ 2026 లో నిర్మలా సీతారామన్ ఇల్లు కొనాలనుకునే వారికి ఎలాంటి కొత్త గుడ్ న్యూస్ చెప్పలేదు. హోమ్ లోన్ తీసుకుంటే పన్ను తగ్గుతుందేమో, ఏవైనా కొత్త రాయితీలు వస్తాయేమో అని ఆశగా ఎదురుచూసిన మధ్యతరగతి జనానికి ఈసారి(Budget 2026) నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు ఇల్లు కొనడం కరెక్టేనా? లేక అద్దె ఇంట్లోనే ఉండిపోవడం లాభమా? అని చాలామంది ఆలోచనలో పడ్డారు. దీనిపై నిపుణులు ఏమంటున్నారో సింపుల్‌గా చూద్దాం.

బేసిక్ హోమ్ లోన్స్ బాస్ అతుల్ మోంగా ఏమంటున్నారంటే.. ఒకవేళ ప్రభుత్వం గనక లోన్లపై మరిన్ని రాయితీలు ఇచ్చి ఉంటే, సామాన్యుడికి ఇల్లు కొనడం ఈజీ అయ్యేది. అప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జోరుగా సాగేది. కానీ ఆ దిశగా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

సొంత ఇల్లు అయితే:

ప్లస్ పాయింట్: అది మన ఆస్తి. ఏటా దాని విలువ పెరుగుతుంది కాబట్టి అది ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్. మన ఇష్టం వచ్చినట్టు మార్పులు చేసుకోవచ్చు, కిరాయి కట్టే తలనొప్పి ఉండదు.

మైనస్ పాయింట్: ఇల్లు కొనాలంటే చేతిలో భారీగా డబ్బు ఉండాలి. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ అంటూ ముందే చాలా ఖర్చవుతుంది. లోన్ కట్టే వరకు అది బ్యాంక్ పేరిటే ఉంటుంది.

అద్దె ఇల్లు అయితే:

ప్లస్ పాయింట్: జేబులో ఎక్కువ డబ్బులు లేకపోయినా హాయిగా ఉండొచ్చు. మెయింటెనెన్స్ అంతా యజమానే చూసుకుంటాడు. ఒకవేళ ఉద్యోగం మారితే వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది.

మైనస్ పాయింట్: ఎంత కాలం ఉన్నా అది మన ఇల్లు కాదు. ఏటా ఓనర్ అద్దె పెంచుతూనే ఉంటాడు. వాడు ఎప్పుడు ఖాళీ చేయమంటాడో అనే టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది.

బ్యాంక్ బజార్ సీఈఓ ఆదిల్ శెట్టి ఒక మంచి మాట చెప్పారు. “ఇల్లు కొనడం అనేది ఇండియన్స్ కి ఒక సెంటిమెంట్. దానివల్ల సెక్యూరిటీ ఉంటుంది. అయితే, కెరీర్ మొదట్లోనే అప్పులు చేసి ఇల్లు కొనేకంటే.. అద్దెకు ఉంటూ ఆ డబ్బును వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయడం ఆర్థికంగా మంచిది” అని ఆయన సూచించారు.

ఎవరో కొంటున్నారని లేదా బంధువులు అడుగుతున్నారని ఇల్లు కొనొద్దు. మీ జీతం పక్కాగా వస్తోంది, EMI కట్టే స్తోమత ఉంది అని నమ్మకం కుదిరినప్పుడే సొంత ఇంటి జోలికి వెళ్ళండి. లేదంటే అద్దె ఇంట్లో ఉంటూ డబ్బు పొదుపు చేసుకోవడమే తెలివైన పని.