India Tariffs : ట్రంప్ ఎందుకు తగ్గాడు.. మోడీ ఏం చెప్పాడు.. తెర వెనుక ఏం జరిగింది?

India Tariffs

India Tariffs : చాలా కాలంగా భారత్, అమెరికా మధ్య సాగుతున్న ట్రేడ్ వార్‌కు ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. సోమవారం రాత్రి ప్రధాని మోదీతో మాట్లాడిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి వచ్చే వస్తువులపై టారిఫ్ ను( India Tariffs) 50 శాతం నుండి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇది వెంటనే అమలులోకి వచ్చింది.

గతంలో రష్యాతో చమురు ఒప్పందాల కారణంగా భారత్‌పై అమెరికా ఏకంగా 50 శాతం వరకు పన్నులు విధించిన సంగతి తెలిసిందే. ఈ పన్నుల తగ్గింపు వల్ల ముఖ్యంగా అమెరికాకు వెళ్లే మన బట్టలపై పన్ను తగ్గడం వల్ల ఇతర దేశాలతో పోటీ పడటం సులభమవుతుంది.

ఈ డీల్ వెనుక ఇద్దరు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహం ప్రధాన పాత్ర పోషించిందని తెలుస్తోంది. ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో మోదీని తన గొప్ప స్నేహితుడని సంబోధించారు. మోదీ కూడా ట్రంప్‌కు ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ చేశారు. అయితే, రష్యా ఆయిల్ కొనుగోలు ఆపివేతపై మాత్రం భారత ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక స్పష్టత రాలేదు.

డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా పన్నులను 25% నుండి 18%కి తగ్గించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక ఫోన్ కాల్‌తో ముగిసిన వ్యవహారం కాదు, దీని వెనుక కొన్ని నెలల చర్చలు, భారత్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఉన్నాయి.

  • రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలన్నది ట్రంప్ ప్లాన్. భారత్ దీనికి అంగీకరించడంతో (అమెరికా వర్గాల సమాచారం ప్రకారం), ఆయన పన్నులను తగ్గించారు.
  • రష్యాకు బదులుగా భారత్ తన చమురు అవసరాల కోసం అమెరికా, వెనిజులా వైపు మొగ్గు చూపడం ట్రంప్‌కు కలిసొచ్చే అంశం. వెనిజులాలో అమెరికాకు అనుకూలమైన మార్పులు వస్తున్న తరుణంలో, ఆ దేశ చమురును భారత్ లాంటి పెద్ద దేశం కొంటే అమెరికా కంపెనీలకు కూడా లాభం జరుగుతుంది.
  • దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా వస్తువులను (ఎనర్జీ, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులు) భారత్ కొనుగోలు చేస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇది అమెరికాలో ఉపాధిని పెంచుతుంది కాబట్టి ట్రంప్ ఈ డీల్‌కు ఓకే చెప్పారు.
  • ఇటీవలే భారత్ యూరోపియన్ యూనియన్ (EU)తో ఒక భారీ వాణిజ్య ఒప్పందం చేసుకుంది. భారత్ తన వ్యాపారాన్ని ఇతర దేశాలకు మళ్లిస్తోందని గుర్తించిన ట్రంప్, అమెరికా వెనకబడిపోకూడదనే ఉద్దేశంతో వేగంగా స్పందించి ఈ రాయితీలు ఇచ్చారు.

Also Read :