వీవీప్యాట్ పై ఈసీకి సుప్రీం నోటీసులు

భారత ఎన్నికల ప్రక్రియ ఓ ప్రహసనం. ఈవీఎంల పనితీరుపై ఎన్నో అనుమానాలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కానీ ఏం లాభం ఓటరు తీర్పుకు విలువలేకుండా పోయింది. టెక్నాలజీతో తీర్పులనే మార్చేస్తున్నారు. ట్యాంపరింగ్ ఆరోపణలు, వీవీ ప్యాట్ల పనితీరు సంగతేంటో మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో తెలిసిందే కదా. ఎన్నికల సంఘమే అసలు దోషిగా మారిన ఆ ఎన్నికలతో దేశం మొత్తం ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది.

ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై 23 పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం వీవీప్యాట్లను లెక్కించి, వాటిని ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చేలా నిబంధనలు తీసుకురావాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశాయి. అయితే ఈసీ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో కోర్టును ఆశ్రయించాయి రాజకీయ పార్టీలు. దానిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది సర్వోన్నత న్యాయస్థానం. పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

LEAVE A REPLY