గాంధీ భవన్ లో పొట్టు పొట్టు తిట్టుకున్న కాంగ్రెస్ సీనియర్లు..!

స్టేట్ కాంగ్రెస్ తీరు మారేలా లేదు. గాంధీభవన్ వేదికగా మరోసారి…. పార్టీ సీనియర్లు నువ్వా నేనా అనుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన పార్టీ పెద్దను సైతం లెక్క చేయకుండా ఒకరినొకరు తిట్టుకున్నారు. నువ్వెంతా అంటే.. నువ్వెంతా అని వార్నింగులు ఇచ్చుకున్నారు.

గాంధీ భవన్‌లో సీనియర్‌ నాయకులు షబ్బీర్‌ అలీ, వీ హనుమంతరావు  పరస్పరం దూషణలకు దిగారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత గులాంనబీ ఆజాద్‌ ముందే వీళ్లిద్దరు వాగ్వాదానికి దిగారు. ఆజాద్‌ పర్యటనపై తనకు సమాచారం లేదని వీహెచ్‌ తొలుత ఆగ్రహం వ్యక్తం చేయగా… దానికి ఆయనకేంది చెప్పేదంటూ షబ్బీర్ అలా ఘాటుగా స్పందించారు. దీంతో ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. ఇద్దరికి సర్ధిచెప్పేందుకు గులాంనబీ ఆజాద్ ప్రయత్నించినా…ఫలితం లేకపోయింది. తీవ్ర అసంతృప్తి వ్యక్త చేస్తూ సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు వీహెచ్‌.

ఇదిలా ఉంటే… మరోవైపు టీపీసీసీ పదవి కోసం ఆజాద్ ముందు పోటాపోటీ నినాదాలకు దిగారు కొందరు కార్యకర్తలు. పీసీసీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇవ్వాలంటూ ఆయన అనుచరులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. అటు వీహెచ్, షబ్బీర్ అలీ బాహాబాహీ… ఇటు కోమటిరెడ్డి అనుచరుల నినాదాలతో మారుమోగిపోయింది గాంధీభవన్.

Leave a Reply