లివర్ పాడవుతోందా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
పచ్చకామెర్లు
కళ్లు లేదా చర్మం పసుపు రంగులోకి మారుతుంటే లివర్ ఫిల్ట్రేషన్ సరిగ్గా లేదని అర్థం.
పొట్ట ఉబ్బరం
పొత్తికడుపులో కుడివైపున వాపు లేదా విపరీతమైన ఉబ్బరంగా అనిపిస్తే అది లివర్ వాపు కావచ్చు.
విపరీతమైన దురద
చర్మంపై ఎర్రటి దద్దుర్లు లేదా విపరీతమైన దురద వస్తుంటే అది లివర్ సంబంధిత సమస్య కావచ్చు.1
మూత్రం రంగు మారడం
నీళ్లు సరిగ్గా తాగినా మూత్రం ముదురు రంగులో వస్తుంటే లివర్ లో ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది.
ఆకలి మందగించడం
తిన్నది అరగకపోవడం, మాటిమాటికీ వాంతులు వచ్చినట్లు అనిపించడం లివర్ దెబ్బతిన్నదని చెప్పే సంకేతం.
కాళ్ళ వాపులు
పాదాలు, చీలమండల దగ్గర అకస్మాత్తుగా వాపులు రావడం లివర్ ఫెయిల్యూర్ కు ఒక లక్షణం.
ఎప్పుడూ అలసట
రాత్రి పది గంటలు పడుకున్నా పొద్దున్నే లేవగానే విపరీతమైన అలసటగా ఉంటే మీ లివర్ క్లీన్ చేసుకోవాలని అర్థం.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. మద్యపానానికి దూరంగా ఉండండి!1