రాత్రి 10 దాటితే….వాట్సప్ బంద్… అతిక్రమిస్తే అంతేఇక..!!

అవును. నిజం. రాత్రి పది దాటిన తర్వాత…వాట్సప్ వాడితే….నోటీసులు తప్పవు. అలాఅని మీ ఫ్రెండ్ తోనో….ఫ్యామిలీతోనో….లవర్స్ తోనో చాటింగ్ చేసుకుంటే ప్రాబ్లమ్ ఏం లేదు. కేవలం పొలిటికల్ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులకే ఈ నిబంధన వర్తిస్తుంది. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్ వంటి సోషల్ మీడియాను కొందరు దుర్వినియోగం చేస్తుండంతో ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొస్తోంది. నానా పనికిమాలిన మెసేజీలు, వీడియోలతో యూజర్లకు చిరాకు తెప్పిస్తున్న వారిని కట్టడి చేసేందుకు ఆయుధం ప్రయోగిస్తోంది.

అసలే ఎన్నికల టైం దగ్గరపడుతోంది. అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ప్రకటనలు, మార్ఫింగ్ ఫొటోలు, సమాచారంతో వాట్సాప్‌ను ముంచెత్తుతున్నాయి. కుప్పతెప్పలుగా ఎస్ఎంఎస్ లు వచ్చిపడుతున్నాయి. ఈ వ్యవహారం ప్రజాతీర్పును ప్రభావితం చేయడమే కాదు, అల్లర్లకు దారితీసేలా ఉండడంతో ఎన్నికల సంఘం… రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాట్సాప్ ద్వారా మెసేజీలు పంపకూడదని నిషేధం విధించింది. పార్టీలు ఆ ఆదేశాలకు కట్టుబడి ఉండేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల వ్యక్తిగత జీవితానికి భంగం కలగొద్దు.. పోటీ చేసే అభ్యర్థులు రాత్రి 10 గంటల తర్వాత ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకుంటాం అంటూ పేర్కొంది. రాత్రి 10 గంటలు దాటితే ఎక్కడా ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదనే నిబంధన ఎప్పటి నుంచో అమల్లో ఉంది. దీన్ని సోషల్ మీడియాకే కాకుండా ఎస్సెమ్మెస్, వాట్సాప్, ఫోన్ కాల్స్‌కు వర్తింపజేసింది ఎలక్షన్ కమీషన్.

LEAVE A REPLY