‘బిత్తిరి సత్తి’ టీవీ9 నుంచి వెళ్లడానికి అసలు కారణం..! సత్తి పయనమెటు..?

‘బిత్తిరి సత్తి’ టీవీ9 నుంచి వెళ్లడానికి అసలు కారణం..! సత్తి పయనమెటు..?

  24 Jun 2020

టీవీ9 నుంచి బిత్తిరి సత్తి వెళ్లిపోయాడు. ఆయనతో పాటు అతనికి స్క్రిప్ట్ రాసే రైటర్ కూడా రిజైన్ చేశాడు. గతకొంత కాలంగా టీవీ9 యాజమాన్యానికి, సత్తికి గ్యాప్ పెరిగింది. ఇక్కడ జాబ్ చేసుకుంటూ…బయట యూట్యూబ్ లో సొంత చానెల్ నడపడం, ఇతర కమర్షియల్స్ చేయడం.. వీటన్నింటికి తోడు…మొన్న ఫాదర్స్ డే రోజున ఇస్మార్ట్ న్యూస్ లో సత్తి వాళ్ల నాన్న ఫోటో వాడడం టీవీ9 యాజమాన్యానికి అస్సలు నచ్చలేదు. దానికి స్క్రిప్ట్ రైటర్, సత్తి ఇచ్చిన సంజాయిషీతో సంతృప్తి చెందని యాజమాన్యం….. రిజైన్ చేయాల్సిందిగా కోరింది. దీంతో సత్తికి టీవీ9కి రాజీనామా చేయాల్సి వచ్చింది. టీవీ9లో రాత్రి ప్రైమ్ టైమ్ లో వచ్చే ఇస్మార్ట్ న్యూస్ లో సత్తి, శివజ్యోతి కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. వీ6 తర్వాత ఇద్దరూ టీవీ9లో చేరడంతో ప్రోగ్రామ్ కూడా బాగానే క్లిక్ అయింది.

సత్తి కెరీర్
తెలుగు రాష్ట్రాల్లో బిత్తిరి సత్తి బాగా ఫేమస్. బిత్తిరి బిత్తిరి చేతలతో రోజుకో వార్త మోసుకొస్తాడు. అందుకనీ.. చిన్నల నుంచి పెద్దల దాకా అందరూ సత్తిని లైక్ చేస్తారు. వీ6తో తన కెరీర్ ను ప్రారంభించిన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి.. నాలుగు నెలల క్రితం వీ6 ఛానెల్ ను వదిలి టీవీ9లో చేరాడు. టీవీ9 కూడా సత్తికి నెలకు మూడున్నర లక్షల భారీ జీతం ఇచ్చి తీసుకుందనేది మీడియా సర్కిల్స్ లో టాక్.

అందుకే టీవీ9 సత్తిని వదిలించుకుందా ?
గత కొంత కాలంగా టీవీ9 యాజమాన్యానికి బిత్తిరి సత్తికి గ్యాప్ పెరిగిందట. కమర్షియల్స్ విషయంలో పెరిగిన గ్యాప్… చివరకు సత్తి రాజీనామా చేసేదాకా వచ్చిందని తెలుస్తోంది. అయితే.. సత్తి రాజీనామా చేయడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నట్లు తెలుస్తుంది.. సత్తికి నెలకు మూడున్నర లక్షల దాకా సాలరీ ఇస్తున్నట్లు సమాచారం. అంటే ఒక్క సత్తికిచ్చే సాలరీతో ఐదుగురు సీనియర్ జర్నలిస్టుల జీతాలివ్వొచ్చు. ఇంత ఎక్కువ సాలరీ ఇచ్చినా…సత్తి బయట ప్రోగ్రామ్స్, యూట్యూబ్ ఛానెల్ లాంటివి నడపడం టీవీ9 యాజమాన్యానికి నచ్చలేదు. పైగా ఇస్మార్ట్ న్యూస్ లో సత్తి ఎపిసోడ్ అంతా ఆకట్టుకోలేదు…సేమ్ టు సేమ్ వీ6నే కాపీ కొట్టినట్లు ఐపోయింది. దీంతో సత్తిని వదిలించుకోవాలని టీవీ9 భావించినట్లు తెలుస్తోంది. అందుకనీ…సత్తి టీవీ9 నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది.

వాట్ నెక్ట్స్… సత్తి పయనమెటు…?
వీ6ను వదిలేశాడు. టీవీ9 వద్దనుకుంది. నెలలు కూడా భరించలేకపోయింది. మరిప్పుడు సత్తి పయనమెటు. ఆయన ఏ ఛానెళ్లలో చేరబోతున్నారు. మీడియా సర్కిల్స్ లో బాగా వినిపిస్తున్న టాక్. సత్తికి ఏ ఛానెల్ ఛాన్స్ ఇచ్చినా.. టీవీ9 కంటే కాస్త అటూ ఇటూగా సాలరీ ఉండాలి. అంత పెద్ద మొత్తంలో సాలరీ ఇవ్వడానికి ఇప్పుడు ఏ మీడియా సంస్థ ముందుకొచ్చేలా లేదు. కరోనా క్రైసిస్ లో చాలా సంస్థలు తమ తమ స్టాఫ్ ను తగ్గించుకోవడమో… లేక సాలరీలో కోత పెట్టడమో చేస్తున్నాయి. ఈ టైమ్ లో అంత సాలరీ ఇచ్చి సత్తిని తీసుకునే పరిస్థితి లేదు. పోన్లే…ఎలాగూ యూట్యూబ్ ఛానెల్ ఉందిగా… దానిమీదే ఇంకాస్త ఫోకస్ చేద్దామనుకుంటే…. ఎంత కొట్టినా యూట్యూబ్ లో నెలకు మూడున్నర లక్షలు రావాలంటే మాటలు కాదు. ఇప్పుడున్న పరిస్థితిలో అది సాధ్యం కాదు కూడా. వచ్చే గిస్తే….నెలకో లక్ష దాకా రావొచ్చు. బయట కూడా ఇప్పుడు సత్తికి చెప్పుకోదగ్గ ప్రోగ్రామ్స్ ఏమీ వస్తలేవు. చివరకు సత్తి పయనమెటూ అనేది ఇంకొన్ని రోజులు దాటితే కానీ తెలియదు.