కశ్మీర్ పై ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయసేకరణ) ఎందుకు జరగలేదంటే ?

ప్లెబిసైట్. కశ్మీర్ అంశాన్ని తేల్చాల్సిన కీలకమైన చర్య. జమ్మూ హిందువుల డామినేషన్. కశ్మీర్ ముస్లింల అధిపత్యం. లఢక్ భిన్న సంస్కృతులు, బిన్న మతాల సమ్మేళనం. చిక్కంతా కశ్మీర్ విషయంలోనే. సంస్థానాల విలీనం విషయంలో నాటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ సూచన మేరకు ప్లెబిసైట్ కు అంగీకరించింది నెహ్రూ ప్రభుత్వం. కానీ 1950ల నుంచి ప్లెబిసైట్ నిర్వహించాలన్న తన హామీకి దూరమవుతూ వచ్చింది. దీనికి ప్రధానంగా మూడు కారణాలు. ప్లెబిసైట్ నిర్వహించాలంటే… కశ్మీర్ నుంచి పాకిస్తాన్ తమ బలగాలను ఉపసంహరించుకోవాలి. పాకిస్తాన్ ఆ పని చేయలేదు. కశ్మీర్ భారత్లో అంతర్భాగం అని చెబుతూ ఎన్నికలు జరగడం రెండో కారణం. 1980ల నుంచి కశ్మీర్ లోయలో చొరబాట్లు పెరగడం, మిలిటెంట్ యాక్టివిటీస్ పెరగడం మూడో కారణం. జమ్మూ-కశ్మీరీ నేతలు, వేర్పాటువాద నాయకుల స్వార్థరాజకీయాలూ ఇంకో కారణం.

కశ్మీర్ భారత్ కు చెందాలా ? పాకిస్తాన్ కు చెందాలా ? అన్న డైలమాలో ఉండగానే.. ప్లెబిసైట్ నిర్వహించాలని కోరుకునే వారిలోనే విభేదాలు తలెత్తాయి. దాంతో మూడో ప్రత్యామ్నయం తెరపైకొచ్చింది. అదే కశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి(స్వతంత్ర కశ్మీర్). ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కారం కావాలని పాకిస్తాన్ ఎప్పట్నించో కోరుకుంటోంది. దానికి భారత్ కట్టుబడి లేదని చాలాసార్లు ఆరోపించింది. కశ్మీరీల స్వతంత్ర ప్రతిపత్తిని గౌరవిస్తున్నామని చెప్పినా.. మూడో ప్రత్యామ్నయానికి(స్వతంత్ర కశ్మీర్) ఏనాడూ అంగీకరించలేదు. నాటి పరిస్థితుల్లో కశ్మీర్ ను ఐక్యంగా ఉంచాలని ప్లెబిసైట్ నిర్వహించినా అక్కడి సంస్కృతి, జాతులు, భాషాపరమైన వివిధ్యాలతో ఫలితాలు న్యాయబద్ధంగా ఉండేవి కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. కశ్మీరీల భవిష్యత్తు.

LEAVE A REPLY