ఐసీసీ దిక్కుమాలిన తనం : వరల్డ్ కప్ నిర్వహణ అత్యంత దరిద్రం

క్రికెట్ ప్రపంచాన్ని.. ఆ మాటకొస్తే మొత్తం క్రీడా ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెట్టింది వరల్డ్ కప్ ఫైనల్. జూలై 14 క్రీడా చరిత్రలో గుర్తుంచుకోదగ్గరోజు. క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెడుతూ.. బాల్ బాల్ కి అధిపత్యం చేతులు మారుతూ… కప్పు ఇంగ్లండ్ దా, న్యూజిలాండ్ దా అన్న ఉత్కంఠ రేపుతూ సాగింది ఫైనల్ మ్యాచ్. డౌట్ లేదు. కానీ నాణేనికి మరో వైపు అన్నట్టు.. వరల్డ్ కప్ నిర్వహణ ఐసీసీ తీరు తీవ్ర విమర్శలకు గురైంది. దిక్కుమాలిన నిబంధనలతో ఆట స్వరూపం మారిపోయింది. మ్యాచ్ విశ్లేషణ సంగతి పక్కనపెడితే.. బౌండరీ మీటర్ ఆధారంగా ఫైనల్ విజేతను ప్రకటించడమేంటన్నది ఇపుడు క్రీడాభిమానులు సంధిస్తున్న ప్రశ్న. ఇంగ్లాండ్ ఛాంపియన్ అవడం సంగతేమో గానీ న్యూజిలాండ్ పోరాటానికి క్రీడా ప్రపంచం ఫిదా అయింది. సంయుక్త విజేతగా ప్రకటిస్తే బావుండేదన్న అభిప్రాయలు వ్యక్తమయ్యాయి. గల్లీ క్రికెట్ ప్రమాణాలతో ఐసీసీ వరల్డ్ కప్ నిర్వహిస్తోందా… ఈమాత్రం దానికి… ఈ తొక్కలో వరల్డ్ కప్ కోసం టైం వేస్ట్ చేసుకోవాల్నా అన్నది సగటు క్రీడాభిమాని ప్రశ్న.

లీగ్ స్టేజ్ లో అంపైరింగ్ నిర్ణయాలపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. వెస్టిండీస్ పై రోహిత్ శర్మ ఔటవడం టోర్నీలోనే అత్యంత వివాదస్పద నిర్ణయం. థర్డ్ అంపైర్, రిఫరీలకే అర్థం కాక జుట్టుపీక్కున్నారు. పోనీ రోహిత్ ఔట్ నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్ కి డెసిషన్ ని ఓవర్ టర్న్ అయినా చేయాల్సింది. అలా చేయకపోవడం మరో వివాదం. సెమీస్ లో ఆస్ట్రేలియాపై దూకుడుగా ఆడుతున్న జేసర్ రాయ్ ఔట్ వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత చెత్త డెసిషన్. బ్యాట్ కు బాల్ తగలకుండానే ఔటిచ్చాడు ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేన. దానిపై అంపైరింగ్ ను ప్రశ్నిస్తే.. జేసన్ రాయ్ కి శిక్ష వేసింది ఐసీసీ. నిజానికి శిక్ష పడాల్సింది కుమార ధర్మసేనకు. అంతకుముందు కూడా అలాంటి తప్పిదాలు చాలానే జరిగాయి. అన్నింటికి మించి ఇది వరల్డ్ కప్ కాదు.. వర్షం కప్ అని జోకులేసుకునేంతలా మ్యాచులు జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వివాదాలతో వరల్డ్ కప్ ను మమ అనిపించింది ఐసీసీ.

LEAVE A REPLY