వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాదిన్నర పాటు నిరంతరం ప్రజల్లోనే ఉంటానని, ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపడతానని స్పష్టం చేశారు.
పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అవుతానని, ఈ కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గంతోనే ప్రారంభిస్తున్నట్లు జగన్ తెలిపారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. ఈ ప్రభుత్వానికి మరో రెండు బడ్జెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని, వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్లో పూర్తి మార్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రెడ్ బుక్‌తో ఏదైనా చేయొచ్చనే అహంకారంతో ఉన్నారు.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు.. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు.. అందుకే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చింది.. చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారు.. సూపర్ సిక్స్ లేదు, సూపర్ సెవన్ లేదు, అన్నీ మోసాలే అని జగన్ విమర్శించారు.
గవర్నమెంట్ స్కూల్స్ కళ తప్పాయి.. గోరుముద్ద క్వాలిటీ లేకుండా పోయింది.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెండింగ్‌లో పెట్టారు.. ఆరోగ్యశ్రీని కనుమరుగు చేశారు.. 108, 104 సేవలను నిర్వీర్యం చేశారు.. మన ప్రభుత్వం ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించింది.. ఈ ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తోందన్నారు.
గతంలో జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ భారత రాజకీయాల్లోనే ఒక మైలురాయిగా నిలిచింది. 341 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో ఆయన మొత్తం 3,648 కిలోమీటర్లు నడిచారు. 2017 నవంబర్ 6న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమై.. 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది.
Also Read :
- SBI vs HDFC : Home Loan ఎక్కడ తీసుకోవడం బెస్ట్? వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు ఇవే!
- Today Gold Price Hyderabad : రూ.9 వేలు పెరిగిన బంగారం…హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
- Best Credit Cards in India 2026 : 2026లో బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఇవే: షాపింగ్, ట్రావెల్, క్యాష్‌బ్యాక్ కోసం ఏది బెటర్?
