Vizianagaram:చంపేశాడా.. చంపేశారా..? నవదంపతులు మృతి!

Vizianagaram

Vizianagaram: విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. నవదంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తవలస మండలం తమ్మన్నమెరక సమీపంలోని కాలనీలో ఉండే కొప్పుల చిరంజీవి (30), గీతల వెంకటలక్ష్మి (28)లకు 8 నెలల క్రితం పెళ్లి అయింది. చిరంజీవి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. వెంకటలక్ష్మి కొత్తవలసలోని ఓ ప్రైవేట్‌ స్టోర్‌లో పని చేస్తున్నారు.

2025 ఆగస్టు 22వ తేదీ శుక్రవారం రాత్రి ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వెంకటలక్ష్మి విగతజీవిగా నేలపై పడి ఉండగా, చిరంజీవి ఫ్యానుకు ఉరివేసుకొని కనిపించాడు. వీరిద్దరికీ వివాహమై 8 నెలలైందని, ఎంతో అన్యోన్యంగా ఉండేవారని కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంకటలక్ష్మిని చంపేసి చిరంజీవి ఆత్మహత్య చేసుకున్నాడా.. లేకా వీరిని ఎవరైనా చంపేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.