Kavitha : అంతా ఊహించిందే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శులు సోమ భరత్‌కుమార్, టి.రవీందర్‌రావు పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది.
ముందుగా పార్టీ కవితను బహిష్కరిస్తుందని అంతా భావించారు. కానీ అన్యుహంగా పార్టీ కేవలం సస్పెండ్ చేసింది. సస్పెండ్ అంటే కొంతకాలం తరువాత పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ బహిష్కరణ అంటే ఇక పార్టీలోకి తిరిగి తీసుకోవడం ఉండదు. గతంలో బీఆర్ఎస్ ఈటలతో పాటుగా మరికొంతమందిని బహిష్కరించింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు అంతేగట్టిగా కౌంటర్ ఇవ్వాలని కవిత కూడా డిసైడ్ అయ్యారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేయనున్నారు. మరికాసేపట్లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని వెల్లడించనున్నారు.
జైలు నుంచి రిలీజ్ అయ్యాక కవిత ఫుల్ ప్రిపేర్ గానే ఉన్నారు. ఆమె ఎక్కడా కూడా పార్టీ స్టాండ్ తీసుకోలేదు.జాగృతి జెండా నుంచే అన్ని పనులు చేస్తున్నా రు. తాను గట్టిగా మాట్లాడితే పార్టీ నుంచి వేటు తప్పదనే విషయం కూడా ఆమెకు తెలుసు. కొత్త పార్టీ పేరుతోనే రాజకీయాల్లోకి రావాలని ఫుల్ గా కవిత డిసైడ్ అయ్యారు. ఇప్పటికే తెలంగాణ బహుజన్ రాష్ట్ర సమితి పేరుతో ఆమె రిజస్టర్ చేసుకునేందుకు సన్నహాలు చేసుకున్నట్లుగా సమాచారం.
బీఆర్ఎస్ లో ఇప్పుడు కేసీఆర్ తరువాతి స్థానాల్లో హరీష్, కేటీఆర్ లు ఉన్నారు. సో కవిత ఎప్పటికీ ఎదిగే ఛాన్స్ ఉండదు కాబట్టి సొంతగానే ఎదగాలని కవిత గట్టిగానే డిసైడ్ అయ్యారు. తాను మెండిదాన్ని అని చెప్పే కవిత ఇప్పుడు అంతేదూకుడుగా వెళ్తున్నారు. ఆమె తన తండ్రికి రాసిన లేఖను కూడా ఎవరూ లీక్ చేయలేదని ఆమె ఓ జర్నలిస్టు ద్వారా లీక్ చేయించారన్న టాక్ కూడా నడుస్తో్ంది.