BIG BREAKING : టీడీపీలో తీవ్ర విషాదం..కీలక నేత కన్నుమూత!

Malepati Subbanaidu

BIG BREAKING :  ఏపీ టీడీపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు టీడీపీ సీనియర్ నేత, ఏపీ ఆగ్రోస్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు తుదిశ్వాస విడిచారు. పది రోజులుగా బ్రెయిన్ స్ట్రోక్ తో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తెల్లవారుజూమున కన్నుమూశారు. నెల్లూరు జిల్లా దగదర్తిలో ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. సుబ్బానాయుడు మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటుగా టీడీపీ నాయకులు సోమిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన సుబ్బానాయుడు గారు కావలి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా పనిచేశారు. పార్టీ పటిష్టత కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. వారి మరణం పార్టీకి తీరని లోటు. సుబ్బానాయుడు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.

కాగా మాలేపాటి కావలి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, గిరిజనుల సమస్యలపై పోరాడటానికి కృషి చేశారు. కూటమి ప్రభుత్వం ఆయనకు ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APAGROS) ఛైర్మన్ గా నియమించింది.