Skip to content
Saturday, Mar 14, 2026
  • Twitter
  • Facebook
  • Instagram
  • whatsapp
  • Home
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • Finance
  • cinema
  • Health
  • Technology
  • Off Beat
  • Jobs
  • Gallery
Logo

KOTLATA | Telugu News Website

Advertisment Image
National

BIG BREAKING : ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఎక్స్ సేవలు!

KotlataFebruary 16 7:53 pmFebruary 16 7:59 pm
X

BIG BREAKING : ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ‘ఎక్స్’ (X) సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత్ సహా అమెరికా, బ్రిటన్ వంటి అనేక దేశాల్లో వేలాది మంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. సోమవారం సాయంత్రం సుమారు 6:40 గంటల నుండి ఈ అంతరాయం మొదలైనట్లు డౌన్ డిటెక్టర్ గణాంకాలు చెబుతున్నాయి.

యూజర్లు తమ యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసినప్పుడు టైమ్‌లైన్ లోడ్ కాకపోవడం, కొత్త పోస్ట్‌లు కనిపించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా మందికి “Something went wrong” అనే మెసేజ్ కనిపిస్తోంది. కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుమారు 42,000 పైగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.

ప్రస్తుతానికి ఎక్స్ యాజమాన్యం లేదా ఎలాన్ మస్క్ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, సర్వర్ మెయింటెనెన్స్ లేదా ఏదైనా సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఎక్స్ పనిచేయకపోవడంతో యూజర్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, త్రెడ్స్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ మళ్ళీ డౌన్ అయ్యింది అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. గత నవంబర్ 2025లో కూడా ఇలాగే భారీ స్థాయిలో అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Post navigation

⟵ Vijay Deverakonda-Rashmika : అక్కడ పెళ్లి.. ఇక్కడ రిసెప్షన్.. విజయ్,రష్మిక వెడ్డింగ్ కార్డ్ వచ్చేసింది!
Testosterone Symptoms: మగాళ్లలో టెస్టోస్టిరాన్ తగ్గితే అంతే సంగతులా..మరి ఎలా పెంచుకోవాలి? ⟶

Related Posts

Hidma
Madvi Hidma : 27 కేసులు, పోలీసులనే వణికించిన హిడ్మా ప్రొఫైల్ ఇదే!

Madvi Hidma : అల్లూరి జిల్లాలో…

Best Credit Cards in India 2026
Best Credit Cards in India 2026 : 2026లో బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఇవే: షాపింగ్, ట్రావెల్, క్యాష్‌బ్యాక్ కోసం ఏది బెటర్?

Best Credit Cards in India…

Ladakh violence
Ladakh violence : సుప్రీంకోర్టుకు సోనమ్ వాంగ్ చుక్ భార్య

లేహ్ లో అల్లర్లకు రెచ్చగొట్టారన్న ఆరోపణలతో…

Recent Posts

  • Gold : బంగారం కొంటున్నారా? 24k, 22k, 18k మధ్య తేడా తెలుసుకోండి!
  • Nivetha Thomas: నివేదాలో ఇంత హాట్‌నెసా? చూస్తే తట్టుకోలేరు!
  • Kerala Businessman : బాస్ అంటే ఇతనే.. భారత్ గెలిచిందని ఉద్యోగులకు బోనస్!
  • Telangana Jobs:నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..17,992 పోలీసు పోస్టులకు నోటిఫికేషన్!
  • KCRకు బిగ్ షాక్.. రాజకీయాల్లోకి మల్లారెడ్డి కోడలు!
  • Rashmika Mandanna: విజయ్‌తో పెళ్లయ్యాక రష్మికకు కొత్త తలనొప్పి.. పాత ఆడియోపై వార్నింగ్!
  • post office scheme : రోజుకు రూ.200 పెట్టబడి..రూ.40 లక్షలు మీ సొంతం..అదిరిపోయే పోస్ట్ ఆఫీస్ స్కీమ్!
  • Kareena Kapoor : హిందువులను చంపినోడి పేరు ఎలా పెడతారు? కరీనాపై మళ్లీ ట్రోల్స్!
  • Monalisa Marriage : ఇప్పుడు శ్రీమతి మొనాలిసా.. గుడిలో మూడు ముళ్లు వేశాడు!
  • Hyderabad : హైదరాబాద్‌లో దోశ, పూరి బంద్.. హోటళ్లు, హాస్టళ్లు క్లోజ్!

Pages

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Homepage
  • Privacy Policy
| Rapid News by Ascendoor | Powered by WordPress.