మంటల్లో తగలబడిపోతున్నBRS ఆఫీసు!

brs

BRS :ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై దాడి జరిగింది. పార్టీ ఆఫీస్‌ ను ధ్వసం చేసి ఫర్నీచర్‌కు కాంగ్రెస్ కార్యకర్తలు నిప్పుపెట్టారు. అంతేకాకుండా కార్యాలయం ఆవరణలో ఉన్న ఫ్లెక్సీలను కూడా చించేశారు. అనంతరం ఆఫీసుపై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు కాంగ్రెస్ కార్యకర్తలు.

వెంటనే ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతోఅక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్‌ రెండ్డి, మణుగూరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు.

కాగా గతంలో కాంగ్రెస్ కార్యాలయంగా ఉన్న భవనాన్ని.. రేగా కాంతారావు పార్టీ మారాక బీఆర్‌ఎస్‌ కార్యాలయంగా మార్చారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. అందుకే భవనాన్ని స్వాధీనం చేసుకున్నామని చెబుతున్నారు. ప్రభుత్వ స్థలంలో భారత రాష్ట్ర సమితి కార్యాలయం నిర్మించారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణలో ఇద్దరు కార్యకర్తలకు గాయలయ్యాయి. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది