BIG BREAKING : కవితకు హరీష్ స్ట్రాంగ్ కౌంటర్

harish rao

BIG BREAKING :  గత కొంతకాలంగా తనను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కావని, విలువలు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.జీవితంలో పదవులు లేదా డబ్బు పోతే కష్టపడి తిరిగి సంపాదించుకోవచ్చని, కానీ వ్యక్తిత్వం, నమ్మకం కోల్పోతే తిరిగి రాదని హరీష్ రావు పేర్కొన్నారు.

ఒకసారి మాట జారితే దానిని తిరిగి వెనక్కి తీసుకోలేం. మాటతో ఎదుటివారి మనసు గాయపరిస్తే, ఆ బంధాన్ని మళ్లీ అతికించడం చాలా కష్టం అంటూ ఆయన భావోద్వేగంగా స్పందించారు. ఇటీవల కవిత తనపై చేస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకునే హరీష్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. రాజకీయాల్లో సంయమనం పాటించాలని ఆయన సూచించారు.

ఇదిలావుండగా.. గత కొద్ది రోజులుగా పార్టీ వేదికలపై, సోషల్ మీడియాలో కవిత, హరీష్ రావును టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. హరీష్ రావును అందరూ ట్రబుల్ షూటర్ అని పిలుస్తుంటారు, కానీ కవిత ఆయనను బబుల్ షూటర్ అని ఎద్దేవా చేశారు. ప్యాకేజీల కోసం పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.