Kareena Kapoor : హిందువులను చంపినోడి పేరు ఎలా పెడతారు? కరీనాపై మళ్లీ ట్రోల్స్!

Kareena Kapoor

Kareena Kapoor : సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ల ప్రేమకథ చాలా విచిత్రంగా ఉంటుంది. కరీనా కంటే సైఫ్ వయసులో చాలా పెద్దవాడు. సైఫ్ అలీ ఖాన్ తన మొదటి భార్య అమృతా సింగ్‌ను 1991లో వివాహం చేసుకున్నప్పుడు, ఆ పెళ్లికి కరీనా కపూర్ కూడా హాజరైందట.

అప్పుడు సైఫ్ ఆమెను చిన్న పిల్ల కదా అని ‘బేటా.. బేటా..’ (పాప) అని పిలిచేవాడట. కానీ కాలక్రమేణా, వారిద్దరూ కలిసి సినిమాల్లో నటించడం మొదలుపెట్టాక ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఆ ప్రేమ ఎంత బలపడిందంటే, సైఫ్ తన మొదటి భార్య అమృతా సింగ్‌కు 2004లో విడాకులు ఇచ్చి, 2012లో కరీనాను పెళ్లి చేసుకున్నాడు.

సైఫ్ – కరీనా జంటకు ఇద్దరు కుమారులు. పెద్దవాడి పేరు తైమూర్, రెండో వాడి పేరు జహంగీర్. అయితే ‘తైమూర్’ అనే పేరు పెట్టడంపై అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీనికి కారణం చరిత్ర.

14వ శతాబ్దంలో (1398 ప్రాంతంలో) తైమూర్ అనే రాజు భారతదేశంపై దండయాత్ర చేశాడు. ఆ సమయంలో లక్షలాది మంది హిందువులను ఊచకోత కోశాడని, మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డాడని చరిత్ర చెబుతోంది. అటువంటి క్రూరుడి పేరును తన కొడుకుకు ఎలా పెడతారని సోషల్ మీడియాలో కరీనాను విపరీతంగా ట్రోల్ చేశారు.

మొదట్లో సైఫ్ స్నేహితుడి పేరు తైమూర్ అని, ఆ పేరు నచ్చి పెట్టామని చెప్పారు. కానీ, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కరీనా మాట మార్చడం చర్చనీయాంశమైంది. తైమూర్ రాజు పరాక్రమం, అతని ధైర్యం చూసి స్ఫూర్తి పొంది తన కొడుకు కూడా అలానే బలంగా ఉండాలని ఆ పేరు పెట్టినట్లు ఆమె పేర్కొంది. చరిత్ర తెలిసే ఈ పేరు పెట్టానని ఆమె చెప్పడంపై ఇప్పుడు మళ్ళీ విమర్శలు వస్తున్నాయి.