BIG BREAKING : గ్యాస్ కష్టాలు.. కేంద్రం సంచలన ప్రకటన!

LPG cylinder

BIG BREAKING : దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇకపై గ్యాస్ బుక్ చేసిన రెండున్నర రోజుల్లోనే వినియోగదారుడి ఇంటికి సిలిండర్ డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. గతంలో నెలకొన్న జాప్యాన్ని నివారించేందుకు దేశీయంగా LPG ఉత్పత్తిని ఏకంగా 25 శాతం పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. దీనివల్ల నిల్వల కొరత ఉండదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.

ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) గుండా చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం దీనికి ముందే ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకుంది. హార్ముజ్ జలసంధితో సంబంధం లేని ఇతర సురక్షితమైన రూట్ల ద్వారా చమురు దిగుమతులను వేగవంతం చేసింది.

హార్ముజ్ మార్గం ద్వారా నిలిచిపోయిన సప్లై కంటే కూడా ఎక్కువ మొత్తంలో చమురును ఇతర మార్గాల ద్వారా సేకరించామని ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది.