Dosa : ప్రపంచ రికార్డు కోసం 25 గంటల పాటు దోసెలేశాడు

dosa

Dosa : మహారాష్ట్రలోని నాగ్ పుర్ కు చెందిన చెఫ్ విష్ణు మనోహర్ 25గంటలపాటు దోసెలు వేసి వరల్డ్ రికార్డ్స్ బుక్ ఆఫ్ ఇండియాలో స్థానం సంపాదించుకున్నారు. శనివారం ఉదయం 7గంటల నుంచి దోసెలు వేయడం ప్రారంభించిన ఆయన ఆదివారం ఉదయం 8గంటల సమయం వరకు 15వేల 773దోసెలు వేసి రికార్డు సృష్టించారు.

గతేడాది తాను నెలకొల్పిన రికార్డును ఆయనే బద్దలుకొట్టారు. ఈ కార్యక్రమాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ , ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ , వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా నిర్వహకులు పర్యవేక్షించారు. ఇప్పటివరకు విష్ణుమనోహర్ తనదైన శైలిలోవంటల్లో ప్రయోగాలు చేస్తూ…..30 రికార్డులు నెలకొల్పారు.

ప్రస్తుతం నెలకొల్పిన రికార్డుతో వాటి సంఖ్య 31కి చేరింది. గతేడాది నాగ్ పుర్ లో 24 గంటలపాటు దోసెలు వేసి రికార్డు సాధించానని.. ఇప్పుడు అమరావతిలో 25 గంటలు దోసెలు వేశానని చెఫ్ విష్ణు మనోహర్ తెలిపారు. భవిష్యత్తులో పుణె, హైదరాబాద్ , కాన్పూర్ , శంభాజీనగర్ లో ఒక్కో గంట పెంచుతూ దోసెలు వేసి రికార్డు సాధిస్తానని అన్నారు. ఈటీవీతో కలిసి తాను 11ఏళ్లుగా పని చేస్తున్నానని…..దానివల్లే తనకు ప్రజల్లో గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు.