Monalisa Marriage : ఇప్పుడు శ్రీమతి మొనాలిసా.. గుడిలో మూడు ముళ్లు వేశాడు!

Monalisa Marriage

Monalisa Marriage :  కుంభమేళా ఫోటోలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మొనాలిసా (మోనీ భోంస్లే), తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌తో కలిసి బుధవారం కేరళలో ఒక్కటయ్యారు. తిరువనంతపురం సమీపంలోని పూవార్‌లోని అరుమానూర్ శ్రీ నైనార్ దేవాలయంలో వీరి వివాహం అత్యంత వేడుకగా జరిగింది. ఈ పెళ్లికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ స్వయంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన మొనాలిసా, మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే వీరిద్దరి మతాలు వేరు కావడంతో మొనాలిసా తండ్రి ఈ పెళ్లికి తీవ్రంగా అడ్డు చెప్పారు. ఆమెను బలవంతంగా ఇండోర్ తీసుకెళ్లి, తన బంధువుల అబ్బాయితో పెళ్లి చేయాలని ప్రయత్నించారు.

దీంతో ప్రాణభయంతో ఈ జంట కేరళకు పారిపోయి వచ్చి, పూవార్‌లోని ఓ సినిమా షూటింగ్ సెట్ నుండి పోలీసుల సహాయం కోరారు. తంబనూర్ పోలీస్ స్టేషన్‌లో ఆశ్రయం పొందిన వీరికి, కేరళ ప్రభుత్వం మరియు పోలీసులు పూర్తి రక్షణ కల్పించి ఈ వివాహం జరిపించారు. ఫర్మాన్ ఖాన్ ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా, మోడల్‌గా రాణిస్తున్నారు.