Virosh Wedding : ఒక్కటైన విరోష్: రష్మిక మెడలో తాళి కట్టిన విజయ్!

Virosh Wedding

Virosh Wedding : టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట ఏడడుగులు వేశారు. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో విజయ్, రష్మికలు తమ కొత్త జీవితాన్ని అత్యంత వైభవంగా ప్రారంభించారు.

అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘విరోష్’ (VIROSH) వివాహ వేడుకకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రెండు వేర్వేరు సంస్కృతులు, సంప్రదాయాలను గౌరవిస్తూ వీరి వివాహాన్ని రెండు పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం 10:10 గంటలకు తెలుగు హిందూ సంప్రదాయం ప్రకారం విజయ్ దేవరకొండ రష్మిక మెడలో తాళి కట్టారు.

ఆ తర్వాత, సాయంత్రం 4:30 గంటలకు రష్మిక సొంత ఊరు కూర్గ్ (కర్ణాటక)కు చెందిన కొడవ సంప్రదాయం ప్రకారం మరోసారి వేడుక జరగనుంది. ఈ అరుదైన రెండు సంస్కృతుల కలయిక ఈ వివాహానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపడం విశేషం. మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.