BIG BREAKING : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది. రన్‌వేపై విమానాలు ట్రాక్‌పై కదులుతున్నప్పుడు చేస్తున్న సమయంలో రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్పైస్‌జెట్‌కు చెందిన B737-700 విమానం, అక్కడ నిలబడి ఉన్న ఆకాశ ఎయిర్ విమానాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో స్పైస్‌జెట్ విమానం కుడి వైపున ఉన్న వింగ్లెట్ (రెక్క భాగం) తీవ్రంగా దెబ్బతింది. అలాగే ఆకాశ ఎయిర్ విమానం ఎడమ వైపున ఉండే హారిజంటల్ స్టెబిలైజర్ కూడా డ్యామేజ్ అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు స్పైస్‌జెట్ విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. రెండు విమానాలు ప్రస్తుతం సర్వీసుల నుంచి తాత్కాలికంగా తప్పుకున్నాయి.
Update –
➡हादसे के बाद रनवे पर विमान का पंख गिरा #Delhi #Airport #Accident @DelhiAirport https://t.co/02shPzPOgA pic.twitter.com/Gx2YFuYUDM— Journalist Ravendra kumar (@Chhotukingoffi1) April 16, 2026
ఆకాశ ఎయిర్ ప్రతినిధి ఈ ఘటనపై స్పందిస్తూ.. “ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు ప్రయాణించాల్సిన క్యూపీ 1406 (QP 1406) విమానం టేకాఫ్ కావడానికి ముందే ఈ ఘటన జరిగింది. మా విమానం స్థిరంగా నిలబడి ఉండగా, వేరే ఎయిర్‌లైన్ విమానం వచ్చి ఢీకొట్టింది. ప్రయాణికులు మరియు సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారు. వారందరినీ సురక్షితంగా కిందకు దించాము. హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేస్తున్నాము” అని తెలిపారు.
మరోవైపు స్పైస్‌జెట్ ప్రతినిధి మాట్లాడుతూ, టాక్సీయింగ్ సమయంలో జరిగిన ఈ పొరపాటు వల్ల రెండు విమానాలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు విమానాన్ని ఢిల్లీలోనే ఉంచుతామని వెల్లడించారు. ఈ ప్రమాదం వల్ల విమానాశ్రయంలో కాసేపు గందరగోళం నెలకొన్నప్పటికీ, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
