BIG BREAKING : పార్లమెంట్ లో కేంద్రమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు భారీగా పెరగనున్నాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో 25 లోక్‌సభ స్థానాలు ఉండగా, వాటిని 38కి పెంచనున్నారు. అంటే ఏపీలో అదనంగా 13 మంది ఎంపీలు రాబోతున్నారు.
ఇక తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 స్థానాలను 26కి పెంచనున్నారు. అంటే తెలంగాణలో మరో 9 కొత్త ఎంపీ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇక కర్ణాటకలో 28 సీట్ల నుండి 42 సీట్లకు పెంపు. తమిళనాడు: 39 సీట్ల నుండి 59 సీట్లకు పెంపు, కేరళలో 20 సీట్ల నుండి 30 సీట్లకు పెంచనున్నారు.
జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను అమిత్ షా కొట్టిపారేశారు. “దక్షిణాదిలో జనాభా శాతం కంటే ఎక్కువగానే సీట్లు పెరుగుతాయి. ప్రతిపక్షాలు కేవలం అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి” అని ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ పెంపు వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాముఖ్యత తగ్గుతుందని భయపడాల్సిన అవసరం లేదని, కేంద్రం అందరికీ న్యాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
