Telangana : 18 ఏళ్ల యువతిపై 10 మంది సామూహిక అత్యాచారం!

Telangana :జనగామ జిల్లాలో దారుణం జరిగింది.18ఏళ్ల యువతిపై 10 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్దారు. మహ్మద్ ఓవైసీ అనే వ్యక్తితో యువతికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. యువతిని శారీరకంగా వాడుకున్నాడు. అలాగే తన 9మంది స్నేహితులను కూడా ఆమెకు పరిచయం చేశాడు. అయితే – జూన్‌ నెలలో మాట్లాడుదామని పిలిచి కారులో ఓ రూమ్ కు తీసుకువెళ్లి యువతిపై ఒకరి తరువాత మరోకరు సామూహిక అత్యాచారం చేశారు.

భయంతో బాధితురాలు విషయం ఎక్కడా చెప్పలేదు. –ఆ తరువాత అందులోని ఓ యువకుడు ప్రేమ, పెళ్లి పేరుతో గోవాకు తీసుకెళ్లి ఆమెపై మరోసారి అత్యాచారం చేశాడు. జనగామకు తిరిగొచ్చాక బాధితురాలు తన చిన్నమ్మ సాయంతో ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విచారించి బాధితురాలిపై 10 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించారు.

బుధవారం జనగామలో వారందరినీ అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. నిందుతులను జనగామకు చెందిన ముత్యాల పవన్‌కుమార్‌, బొద్దుల శివకుమార్‌, అబ్దుల్‌ ఖయ్యూం, పుస్తకాల సాయితేజ, ముత్తడి సుమంత్‌రెడ్డి, గుండ సాయిచరణ్‌రెడ్డి, ఓరుగంటి సాయిరాం, నెల్లుట్లకు చెందిన నూకల రవిగా గుర్తించారు. వీళ్లు ఎవరికి కూడా పెళ్లి కాలేదు. ప్రధాన నిందితుడు ఒవైసీ జనగామలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు తెలిసింది.