Peddi Review : కమర్షియల్ సినిమాలు చేయడానికి టాలీవుడ్లో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ, కేవలం స్టార్డమ్ నమ్ముకోకుండా కథను నమ్ముకుని సినిమా చేయాలంటే ఒక కమర్షియల్ హీరోకు చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రమే ‘పెద్ది’(Peddi Review ). దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. ప్రేక్షకులక ఒక అద్భుతమైన ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది.
ఈ సినిమాలో హై మూమెంట్స్ సీన్లు మాత్రమే వెతికితే దొరకవు. కథలో ఎత్తులు, పల్లాలు రెండూ ఉన్నాయి. తన గుర్తింపు కోసం ఓ కుర్రాడు చేసే పోరాటమే ఈ సినిమా. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అతను ఆటను ఆయుధంగా వాడుకుంటాడు. అసలు పెద్ది గాడు తన ఆటతో ఏం చేశాడు? తన ఊరి భవిష్యత్తును ఎలా మార్చాడు? అనేదే ఈ చిత్ర కథ.
వినడానికి కథ చాలా పాతదైనా, బుచ్చిబాబు దీనిని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది. ఫస్టాఫ్ అంతా కమర్షియల్ పంథాలో సాగుతూ, క్రికెట్ సీన్స్తో ఆకట్టుకుంటుంది. మధ్యలో కొన్ని సీన్లు కాస్త సాగదీసినట్లు అనిపించినా.. ఇంటర్వెల్ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఒక్కసారి కుస్తీ బరిలోకి దిగాక కథలో వేగం పెరుగుతుంది. క్లైమాక్స్ వచ్చేసరికి సినిమా ఒక బరువైన ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది.
సినిమా మొత్తాన్ని రామ్ చరణ్ ఒంటిచేత్తో నడిపించాడు. చరణ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడని చెప్పడం కూడా చిన్నమాటే అవుతుంది. రంగస్థలంలో చిట్టిబాబు పాత్ర ఎంతగా గుర్తిండిపోయిందో.. ఇప్పుడు ‘పెద్ది’లో చరణ్ నటన దాన్ని మరిపించేలా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు ఏం చెబితే అది కళ్లు మూసుకుని నమ్మి చేశాడు చరణ్.
ఈ సినిమాలో స్క్రీన్ మీద కనిపించే హీరో రామ్ చరణ్ అయితే.. తెరవెనుక ఉండి సినిమాను నడిపించిన మరో హీరో ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా రీఫ్రెషింగ్గా ఉంటూ సినిమా స్థాయిని పెంచేసింది.
మిగతా పాత్రల విషయానికొస్తే.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పాత్ర సినిమాలో చాలా బాగుంది. జాన్వీ కపూర్, దివ్యేందు క్యారెక్టర్స్ ఓకే అనిపిస్తాయి. అప్పల సూరిగా జగపతిబాబు మరోసారి ఒక మంచి పాత్రలో మెప్పించారు.కేవలం మాస్ ఆడియన్స్నే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఈ ఎమోషనల్ డ్రామా బాగా ఆకట్టుకుంటోంది.
Also Read :
Peddi: సరకు, సామాన్లు.. దెబ్బకు ‘చికిరి’ లిరిక్స్ మార్చేశారు!.. కొత్త లిరిక్స్ ఇవే
