Peddi: సరకు, సామాన్లు.. దెబ్బకు ‘చికిరి’ లిరిక్స్ మార్చేశారు!.. కొత్త లిరిక్స్ ఇవే

Peddi

Peddi: సోషల్ మీడియా మరోసారి తన సత్తా చాటుకుంది. సోషల్ మీడియా వల్ల పరువంతా పోయి.. రోడ్డున పడిన వాళ్లూ ఉన్నారు. అదే సోషల్ మీడియా వల్ల రాత్రికి రాత్రే కోట్లు గడించిన వాళ్లూ ఉన్నారు. ఇదంతా ఇప్పుడు మాకెందుకు అనుకుంటున్నారా.. ఆగండాగండి.. అక్కడికే వద్దాం.. ఇప్పుడు అదే సోషల్ మీడియా వల్ల ఓ పెద్ద (Peddi)  సినిమాలో.. అది కూడా బాగా ట్రెండ్ అయిన సాంగ్ నుంచి కొన్ని పదాలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ… ఆ పాటేంటీ.. అన్న విషయాల గురించి ఆరా తీస్తే..

మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ మూవీ ఈ రోజు అంచనాలకు తగ్గట్టుగా అత్యంత గ్రాండ్ గా థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో మూవీకి సంబంధించిన కొన్ని క్లిప్స్ వైరల్ అవడం కూడా చూసే ఉంటాం. ఈ క్రమంలోనే ‘పెద్ది’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘చికిరి చికిరి’ చాలా మంది వినే ఉంటారు. సంగీత దిగ్గజం ఏఆర్ రెహ‌మాన్ స్వరపరిచిన ఈ పాట విడుదలైన క్షణం నుంచే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించడమే కాకుండా.. సోషల్ మీడియాలోనూ బాగా ట్రెండ్ అయింది. చిన్నారుల నుంచి యువత వరకు అందరూ ఈ సాంగ్ కు తగ్గ స్టెప్పులేస్తూ రీల్స్ క్రియేట్ చేసి.. మరింత సెన్సేషన్ చేశారు.

Peddi సాంగ్ లిరిక్స్

జూన్ 3 రాత్రి తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన స్పెషల్ ప్రీమియర్ షోలతో పెద్ది సినిమా సందడి మొదలైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రీమియర్ షోలను వీక్షించిన ప్రేక్షకులు వెంటనే ఒక విషయాన్ని గమనించారు. మొదట విడుదలైన పాటలో “పడతా పడతా పడతా.. ఎనుకే ఎనుకే పడతా.. సరుకు సామాన్లు సూసి మీసం లేసి ఏసే కేక.. చికిరి చికిరి” అనే పదాలు ఉండడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీంతో థియేటర్లలో ప్రదర్శితమైన సినిమా వెర్షన్‌లో “సరుకు సామాన్లు” అనే పదాలను తొలగించి, వాటి స్థానంలో “సొగసు సింగారం” అనే పదాలను ఉపయోగించినట్లు అభిమానులు చెబుతున్నారు.

అయితే ఈ సామాన్లు అనే పదాన్ని ఎందుకు తొలగించారు. దీని వల్ల ప్రాబ్లెమ్ ఏముందన్న విషయానికొస్తే.. దాని వెనుక ఓ చిన్న స్టోరీనే ఉంది. దానికి కారణం సోషల్ మీడియానే. అందుకే స్టార్టింగ్ లో చెప్పాం కదా సోషల్ మీడియా ఏదైనా చేస్తుంది అని. అది ఇదే అన్నమాట. గత కొంతకాలంగా ‘సామాన్లు’ అనే పదంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా నటుడు శివాజి ఒక కార్యక్రమంలో మహిళల వస్త్రధారణపై వ్యాఖ్యానిస్తూ చేసిన పదప్రయోగం వివాదానికి దారితీసింది. ఇంకేముంది ఆ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, నెటిజన్లు కాస్తా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సమయంలోనే ‘చికిరి చికిరి’ పాటలోని “సరుకు సామాన్లు” లిరిక్స్‌పై కూడా కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. మహిళలను కించపరిచే విధంగా ఆ పదాలు ఉన్నాయని కామెంట్లు వచ్చినప్పటికీ చిత్ర బృందం ఎలాంటి వివరణా ఇవ్వలేదు. కానీ సినిమా విడుదల టైంకి మాత్రం నిర్ణయం మార్చుకున్నారు. ఈ పదాల వల్ల ఏమైనా వివాదం తలెత్తుతుందని అనుకున్నారో ఏమో.. సైలెంట్ గా లిరిక్స్ మార్చి.. థియేటర్స్ లో కొత్త వెర్షన్ రిలీజ్ చేశారు. ఏదేమైనా లాస్ట్ మినిట్ లోనైనా మూవీ యూనిట్ మంచి డెసిషన్ తీసుకుందని పలువురు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Malvika Nair : బ్లాక్ లెహంగాలో హీట్ పెంచుతున్న మాలవికా.. చూపు తిప్పుకోలేరుగా!