Kadapa : అది చిన్నప్పటి నుంచి పెరిగిన స్నేహం. పెరిగి పెద్దయ్యాక ఆ స్నేహమే ప్రేమగా మారింది. బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు సాధించి పెళ్లి చేసుకోవాలని ఆ ఇద్దరు ఎన్నో కలలు కన్నారు. కానీ, చిన్న గొడవ వారిద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. యోగేంద్రకుమార్ వర్మ (19), హేమశ్రీ (19) అనే ఇద్దరు విద్యార్థులు చేసిన ఈ పని ఆ రెండు కుటుంబాల్లో తీరని చీకటిని నింపింది.
కడపలో డిగ్రీ చదువుతున్న వీరిద్దరూ మనస్పర్థల కారణంగా గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన యోగేంద్ర ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తను ప్రేమించిన వాడు లేడనే వార్త విన్న హేమశ్రీ.. ఆ బాధను తట్టుకోలేక తను కూడా బలవన్మరణానికి పాల్పడింది.
బ్రతికున్నప్పుడు ఎలాగూ కలిసి ఉండలేకపోయారు.. కనీసం మరణంలోనైనా తోడుగా ఉండనివ్వాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. మంగళవారం చెన్నూరు సమీపంలో ఇద్దరికీ పక్కపక్కనే అంత్యక్రియలు నిర్వహించారు.
“చూస్తుండగానే నూరేళ్ల జీవితాన్ని ముగించుకున్న ఆ పిల్లలను చూసి గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఆఖరి ప్రయాణంలోనైనా ఆ ప్రేమికులు పక్కపక్కనే సాగిపోయారు.”
